Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా పెరుగుతున్నప్పటికీ విద్యుత్ భద్రత ప్రమాణాల అనుసరణ పరంగా మాత్రం వెనుకబడి ఉంది. విద్యుత్ ప్రమాదాలతో ప్రతి రోజూ 11 మంది మరణిస్తున్న నేపథ్యంలో దీనిపై ఐసీఏ ఇండియా అవగాహన కల్పించింది. గురువారం హైదరాబాద్‌లో జీరో టోలరెన్స్ ఎలక్ట్రిక్ సేఫ్టీ ప్రచారాన్ని నిర్వహించింది. మెరుగైన సాంకేతిక ప్రక్రియలను అనుసరించేలా ప్రోత్సహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. గహ, వాణిజ్య, పబ్లిక్ బిల్డింగ్స్‌లో విద్యుత్ భద్రతపై బిఐఎస్, ఐజిబిసి సహకారంతో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఐజిబిసి హైదరాబాద్ చాఫ్టర్ ఛైర్మన్ సి శేఖర్ రెడ్డి, ఐసిఎ ఇండియా డైరెక్టర్ కె ఎన్ హేమంత్ పాల్గొని మాట్లాడారు.