Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా భారీ విరాళాన్ని ప్రకటించింది. కరీంనగర్లో భరోసా సెంటర్ ఏర్పాటుకు రూ.1.70 కోట్లు సాయం అందించడానికి ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ డీజీఎం అండ్ సీడీఓ జితేంద్ర కుమార్ శర్మ తొలుత రూ.25 లక్షల విలువ చేసే చెక్కును వుమెన్ సెఫ్టీ వింగ్ డిఐజి బి సుమతికి అందజేశారు. మహిళలు, పిల్లలకు రక్షణ కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పని చేసే భరోసా కేంద్రాలు పని చేస్తున్నాయి.