Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సరుకు రవాణ, కోరియర్ సర్వీసులను అందించే డీహెచ్ఎల్ ఎక్స్ప్రెస్ ఛార్జీలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత ధరలతో పోల్చితే 7.9 శాతంగా పెంపు ఉంటుందని తెలిపింది. నూతన రేట్లు వచ్చే కొత్త ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ద్రవ్యోల్బణం, కరెన్సీ, నియంత్రణ, భద్రత చర్యలకు సంబంధించిన పాలనా వ్యయాలను పరిగణనలోకి తీసుకుని రేట్లు పెంచినట్లు తెలిపింది.