Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత బ్యాంక్‌ల్లో మొండి బాకీలు తగ్గొచ్చని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. స్థూల ఎన్పీఏలు 0.90 శాతం మేర తగ్గి 5 శాతానికి పరిమితం కావొచ్చని అంచనా వేసింది. 2024 మార్చి నాటికి 4 శాతానికి తగ్గొచ్చని తెలిపింది. పునరుద్ధరణ రుణాల్లో పావు వంతు ఎన్పీఏలుగా మారొచ్చని పేర్కొంది. ఎన్పీఏలు తగ్గినప్పటికీ బ్యాంకింగ్ రంగం ముందు ఇతర విభాగాల నుంచి అనేక సవాళ్లు పొంచి ఉన్నాయని హెచ్చరించింది.