Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చరిత్రలోనే ఆల్ టైమ్ కనిష్టానికి
న్యూఢిల్లీ: డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇది వరకు ఎప్పుడూ లేని స్థాయిలో 81కి క్షీణించింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపునతో డాలర్‌కు డిమాండ్ పెరగడం, దేశీయంగా స్టాక్ మార్కెట్ల భారీ పతనం, ఎఫ్ఐఐలు తరలిపోవడం, విదేశీ మారకం నిల్వల్లో తగ్గుదల, వాణిజ్య లోటు పెరుగుదల తదితర పరిణామాలు రూపాయి విలువను బక్కచిక్కెలా చేస్తున్నాయి. ఓ దశలో 81.23కు పడిపోయింది. తుదకు 25 పైసలు పతనమై 81.04 వద్ద నమోదయ్యింది. ఇది రూపాయి చరిత్రలోనే ఆల్‌టైం కనిష్టం కావడం గమనార్హం.