Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మణిపాల్ వైద్యుల ఘనత
భీమవరం: విజయవాడ మణిపాల్ హాస్పిటల్ వైద్యులు 68ఏళ్ళ వృద్దురాలికి బేరియాట్రిక్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. అనారోగ్య సమస్యల్లో జి సరోజిని (68) వీల్ చైర్ కే పరిమితమైంది. ఆమెను కుటుంబ సభ్యులు విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి . తీసుకెళ్ళారు. స్ట్రోక్, రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం వంటి సమస్యల్లో ఆమె బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ సమస్యలకు ప్రధాన కారణం అధిక బరువుగా గుర్తించిన వైద్యులు బేరియాట్రిక్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఈ సర్జరీ విధానం, ఈ చేస్తే కలిగే ప్రయోజనాలను సరోజినీకి వివరించారు. సర్జరీకి ఆమె సిద్దపడ్డంతో వైద్యుల పర్యవేక్షణలో నియమాలు పాటిస్తూ ఆమెకు రెండువారాల పాటు మితాహారాన్ని అందించారు. దీంతో ఆమె సర్జరీకి ముందే కొద్దిగా బరువు తగ్గారు. అనంతరం సరోజినికి లాప్రోస్కోపిక్ ద్వారా డాక్టర్ సురేంద్ర జాస్తి బేరియాట్రిక్ సర్జరీ చేశారు.
48 గంటల్లోనే పూర్తిగా కోవడంతో కేవలం ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకోవాలని సూచిస్తూ ఆమెను ఇంటికి పంపేశారు. ఫోన్ ద్వారా వైద్యబృందం ఆమెకు సలహాలు, సూచనలు అందించారు. మారుతున్న జీవనశైలితో కొత్తకొత్త అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, ఇందులో అధిక బరువు ప్రధానమైందని ఈ సందర్భంగా డాక్టర్ సురేంద్ర పేర్కొన్నారు. అధిక బరువుతో గుండెజబ్బులు, ఫ్యాటీలివర్, షుగర్, బిపి వంటి పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ఏ చిన్న అనారోగ్య సమస్య తలెత్తినా ని ర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలని సూచించారు. మణిపాల్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ కంటిపూడి సుధాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం బేరియాట్రిక్ సర్జరీకి ప్రాధాన్యత పెరిగిందన్నారు. ఉబకాయంతో బాధపడుతున్న వారికి ఈ సర్జరీ ఓ పరిష్కారంగా మారిందన్నారు. తక్కువ మొత్తంలో సామాన్యులకు కూడా ఈ సర్జరీని అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.