Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) అనుబంధ సంస్థ మేఘా గ్యాస్ పేరు మేఘా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రయి వేట్ లిమిటెడ్ (ఎంసీజీడీపీిఎల్)గా మారింది. దేశంలో వివిధ నగరాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) పేరుతో మేఘా గ్యాస్ ఇప్పటివరకు నిర్వహిస్తోంది. ఇక నుంచి మేఘా గ్యాస్ బదులు ఎంసీజీడీపీిఎల్ కంపెనీ ఇక నుంచి అన్ని రకాల అనుమతులున్న అధీకత సంస్థగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌ను చేపడుతుందని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు మేఘా గ్రూప్‌లో ఒక విభాగంగా ఉన్న మేఘా గ్యాస్‌కున్న అనుమతులన్నింటినీ ఎంసీజీడీపీిఎల్ కు బదిలీ చేయాలంటూ ఎంఇఐఎల్ చేసిన అభ్యర్థనను పెట్రోలియం , సహజ వాయువు నియంత్రణ మండలి ఆమోదించిందని తెలిపింది.