Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టాటా మోటార్స్ వెల్లడి
- మూడు పికప్ వాహనాల ఆవిష్కరణ
హైదరాబాద్: టాటా మోటార్స్ వాణిజ్య వాహన విభాగం (సీవీ)లో ప్రతీ ఏడాది రూ.2,000 కోట్ల పెట్టుబడుల కు ప్రణాళికలు చేశామని ఆ కంపెనీ ప్రకటించింది. మరిన్ని కొత్త వాహనాలను ఆవిష్కరించడంపై దృష్టి సారించినట్లు తెలిపింది. సోమవారం హైదరాబాద్లో ఈ కంపెనీ దేశ మార్కెట్లోకి యోదా 2.0, ఇన్ఫ్రా వి20 బై ఫ్యూయల్, ఇన్ఫ్రా వి50 మోడళ్లను విడుదల చేసింది. ఈ మూడు కూడా తేలికపాటి వాణిజ్య వాహనాలు. ఈ సందర్బంగా టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాగ్ మాట్లాడుతూ వాణిజ్య వాహనాల ఇంజిన్లు, ప్రత్యామ్నాయ ఇంధన, విద్యుత్ వాహనాలపై రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నామన్నారు. టాటా యోదా 2.0 ఫిక్అఫ్ మోడల్ ధరను రూ.9.99 లక్షలుగా, ఇన్ఫ్రా వి50 ధరను రూ.8.67 లక్షలుగా నిర్ణయించింది.