Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మొల్బియో డయాగ్నోస్టిక్స్ ఆరోగ్య సంరక్షణను చేరువ చేయడానికి నిధులు సమీకరించినట్లు తెలిపింది. అంతర్జాతీయంగా పెట్టుబడులు పెట్టే టెమాసెక్ తమ సంస్ధలో 85 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.690 కోట్లు) పెట్టుబడులను అందించిందని ఆ సంస్థ వెల్లడించింది. ఈ నిధులు వ్యాధి నిర్ధారణ పరంగా ఉన్న అత్యంత కీలకమైన అంతరాలను పరిష్కరించడంలో నూతన సాంకేతికతలను తీసుకురావాలనే తమ ప్రయత్నాలు మరింత వేగవంతం చేయడానికి దోహదం చేయనున్నాయని మొల్బియో డయాగ్నోస్టిక్స్ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ నాయర్ తెలిపారు.