Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రస్తుత పండగ సీజన్‌ను ఉజ్వలంగా మార్చేందుకు తన అన్ని బ్యాంకింగ్, షాపింగ్‌లపై రాయితీలతో కూడిన 'ఫెస్టివ్ ట్రీట్స్ 4.0'ను ప్రకటించినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. వినియోగ దారులకు ఖాతాలు, రుణాలు, కార్డులు, ఈఎంఐల ద్వారా పలు రకాల ఆఫర్లను అందిస్తున్నట్టు పేర్కొంది. వినియోగదారులు 10 సెకన్లలో వ్యక్తిగత రుణం, కేవలం 30 నిమిషాల్లో ఎక్స్‌ప్రెస్ కార్ లోన్, కార్డ్‌లపై రుణం లేదా పూర్తిగా ఆన్లైన్లో తక్షణమే ఖాతాను తెరవవచ్చని తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆన్లైన్, ఆఫ్‌లైన్ వ్యాపారులతో బ్యాంకు ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ద్వారా తమ సంస్థ కార్డులపై చేసే చెల్లింపులకు క్యాష్‌బ్యాక్‌లను ఆందిస్తున్నట్టు తెలిపింది.