Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీఎస్ఆర్టీసీకి 10 విద్యుత్ బస్సులు
హైదరాబాద్ : ఎలక్ట్రిక్ బస్సుల తయారీదారు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (ఓలెక్ట్రా) ఏపీఎస్ఆర్టీసీకి 10 అత్యాధునిక విద్యుత్ బస్సులను డెలివరీ చేసినట్లు ప్రకటించింది. బుధ వారం అలిపిరిలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విద్యుత్ బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. గత ఏడాది నవంబర్‌లో, ఒలెక్ట్రా, ఈవీ ట్రాన్స్‌ల కన్సార్షియంకు ఏపీఎస్ఆర్టీసీ నుంచి విద్యుత్‌తో నడిచే 100 బస్సులు సరఫరా చేయడానికి ఆర్డర్‌ను లభించింది. మిగిలిన 90 విద్యుత్ బస్సులను అతి త్వరలో ఒలెక్ట్రా డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది. 50 బస్సులు తిరుమల-తిరుపతి ఘాట్‌లో నడప నుండగా, మిగిలిన 50 బస్సులు నెల్లూరు, కడప, మదనపల్లెలకు ఇంటర్సిటీ బస్సులుగా నడుస్తాయి. కాంట్రాక్టు కాలంలో ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ బస్సుల నిర్వహణను కూడా చేపడుతుందని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కెవి ప్రదీప్ తెలిపారు.