Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రస్తుత తరం ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఫోన్లో కంటెంట్ చూసేందుకే ఆసక్తి చూపిస్తోందని ఓ సర్వేలో వెల్లడైంది. రోడ్ ట్రావెల్ రెండో స్థానంలో ఉండగా కొంతకాలం క్రితం ఆదరణ కోల్పోయిన ఆఫ్లైన్ షాపింగ్ వైపు తిరిగి వెళ్తున్నారని ఇన్ఫోటైన్మెంట్ యాప్ వే2న్యూస్ సర్వేలో వెల్లడయ్యింది. ప్రజల ప్రాధాన్యతలు తెలుసుకునేందుకు తెలంగాణ,ఏపీ లో 3.50 లక్షల మంది అభిప్రాయాలను సేకరించి ఈ రిపోర్టును రూపొందించింది. దీని ప్రకారం.. ఖాళీ సమయాల్లో 63.36 శాతం మంది మొబైల్ ఫోన్లతో గడుపుతున్నారు. ఇందులో 51 శాతం వీడియోలు, 29 శాతం ఓటీటీ కంటెంట్ చూస్తున్నారు. మిగతావారు మ్యూజిక్ వింటున్నారు. ప్రస్తుతం కరోనా ఆంక్షలు తొలగిపోవడంతో అందరూ తిరిగి ప్రయాణాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.