Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతి సులభంగా నగదు విత్‌డ్రాయల్ చేసుకునేందుకు వీలుగా మైక్రో ఏటీఎంలు
ఏ బ్యాంకు ఖాతాదారులు అయినా సరే నగదు విత్ డ్రా చేయవచ్చు.
అలాగే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఏటీఎంల వద్ద ఏదైనా బ్యాంక్ డెబిట్ కార్డు వినియోగించి తమ ఖాతా బ్యాలెన్స్నూ చూసుకోవచ్చు
న్యూఢిల్లీ 28 సెప్టెంబర్ 2022: భారతదేశంలో టైర్ 1 మరియు మెట్రో నగరాలకు ఆవల ఆవాసముంటున్న డెబిట్ కార్డు వినియోగదారులకు అతి సులభంగా నగదు విత్ డ్రాయల్ సౌకర్యం అందించేందుకు వీలుగా మైక్రో ఏటీఎంలను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ బుధవారం వెల్లడించింది.
ఈ బ్యాంక్ , భారతదేశవ్యాప్తంగా 5,00,000కు పైగా బ్యాకింగ్ పాయింట్లతో కూడిన శక్తివంతమైన నెట్‌వర్క్‌పై ఆధారపడి తమ వినియోగదారులకు అతి సులభంగా నగదు విత్‌డ్రాయల్స్‌ను ఈ కార్యక్రమం ద్వారా అందించనుంది. ఈ మైక్రో ఏటీఎం లావాదేవీలకు తగిన మద్దతునందించేందుకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఇప్పుడు నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ (ఎన్ఎఫ్ఎస్)– నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)తో అనుసంధానితమైంది.
ఏదైనా బ్యాంక్ ఖాతా కలిగిన వినియోగదారులు ఇప్పుడు ఈ మైక్రో ఏటీఎం సదుపాయాన్ని తమ చుట్టుపక్కల ఉన్న ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ బ్యాంకింగ్ పాయింట్ వద్ద వినియోగించుకోవచ్చు. వారిప్పుడు తక్షణ నగదు విత్‌డ్రాయల్స్ చేయడం, ఏదైనా డెబిట్ కార్డు వినియోగించి నిర్ధేశిత బ్యాంకింగ్ పాయింట్ వద్ద తమ ఖాతా లో బ్యాలెన్స్ చూసుకోవడం చేయవచ్చు. ఈ మైక్రో ఏటీఎంల ద్వారా ఒక్క లావాదేవీకి గరిష్టంగా 10వేల రూపాయలు విత్‌డ్రా చేయవచ్చు.
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఆపరేటింగ్ ఆఫీసర్ గణేష్ అనంతనారాయణన్ మాట్లాడుతూ 'బ్యాంకింగ్ సేవలను ప్రతి ఒక్కరికీ చేరువ చేయడం ద్వారా ఆర్ధిక సమ్మిళిత భారతదేశాన్ని నిర్మించేందుకు మేము కట్టుబడి ఉన్నాము. మైక్రో ఏటీఎంలను ప్రారంభించడమన్నది దేశంలో గ్రామీణ ప్రాంతాలలో నివాసముంటున్న వినియోగదారులకు సైతం తగిన సాధికారిత అందించాలనే మా ప్రయత్నాలలో భాగం. బ్యాంకు విడుదల చేసిన మొట్టమొదటి ఉపకరణం ఇది. దీనిపట్ల మేము పూర్తి ఆసక్తితో ఉన్నాము. ఇది ఏదైనా బ్యాంకు డెబిట్ కార్డు వినియోగిస్తున్న వినియోగదారులు మా సేవలను వినియోగించుకునేందుకు అనుమతిస్తుంది. మా వైవిధ్యమైన సేవలకు సంబంధించి ప్రస్తుతం అందిస్తున్న సేవలకు అతి ముఖ్యమైన జోడింపుగా ఇది నిలుస్తుంది` అని అన్నారు.
ఎన్పీసీఐ సీఓఓ ప్రవీణ రాయ్ మాట్లాడుతూ 'భారీ మెట్రో నగరాలు మరియు నగరాలకు దూరంగా ఆవాసముంటున్న డెబిట్ కార్డు వినియోగదారుల కోసం మా ఎన్ఎఫ్ఎస్తో భాగస్వామ్యం చేసుకుని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఇప్పుడు మైక్రో ఏటీఎంలను విడుదల చేయడం వల్ల వినియోగదారులు అతి సులభంగా ఆ సేవలను పొందడం వీలవుతుంది. ఇది అతి ముఖ్యమైన అభివృద్ధిగా నిలుస్తుంది. ఎందుకంటే, ఇది ప్రతి ఒక్కరికీ ఆర్థిక సేవలను చేరువ చేయాలనే దేశపు లక్ష్యం చేరుకునేందుకు తోడ్పడుతుంది. ఎన్ఎఫ్ఎస్ ద్వారా దరఖాస్తు మరియు నెట్వర్క్ అప్టైమ్కు సంబంధించి బలమైన ప్రమాణాలు మా సభ్య బ్యాంకులకు మెరుగైన వినియోగదారుల అనుభవాలను అందించడానికి వీలు కల్పిస్తాయి` అని అన్నారు.
మైక్రో ఏటీఎంలను దశలవారీగా అందుబాటులోకి తీసుకువస్తారు. తొలుత, ఈ బ్యాంకు టైర్ 2 నగరాలు, పట్టణాలలో 1,50,000 యూనిట్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ప్రాంతాలలో నగదు విత్‌డ్రాయల్ సేవలకు అత్యధిక డిమాండ్ ఉంటుంది కానీ పరిమితంగా ఏటీఎంలు అందుబాటులో ఉంటాయి.
వినియోగదారులు నగదు విత్‌డ్రాయల్ ఏ విధంగా చేసుకోవచ్చంటే...
1. బ్యాంకింగ్ కరస్పాండెంట్లు (బీసీలు) ఈ లావాదేవీలను విత్‌డ్రాయల్ మొత్తం ప్రవేశపెట్టడం ద్వారా ప్రారంభిస్తారు.
2. ఆ తరువాత వినియోగదారులు తమ డెబిట్‌కార్డును ఈ మెషీన్లో ఉంచడంతో పాటుగా పిన్ నెంబర్ ప్రవేశపెట్టి లావాదేవీని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.
3. ఎంపిన్‌ను ప్రవేశపెట్టడం ద్వారా బీసీ ఈ లావాదేవీ పూర్తి చేసేందుకు తగిన ధ్రువీకరణ అందిస్తారు.
విజయవంతంగా లావాదేవీ పూర్తయిన తరువాత వినియోగదారునికి నగదును బీసీ అందజేస్తారు.