Authorization
Mon Jan 19, 2015 06:51 pm
· మెటా ఫెస్టివ్ మార్కెటింగ్ గైడ్
· ఈ సీజన్లో నూతన బ్రాండ్‌ను 90 శాతానికి పైగా ఫెస్టివ్ షాపర్లు ప్రయత్నించే అవకాశాలున్నాయి ; ప్రతీ 10 మందిలో 8 మంది ఆన్లైన్లో నూతన బ్రాండ్ల కోసం అన్వేషిస్తున్నారు.
· ఇన్ఫ్లూయెన్సర్లు, మెసేజింగ్, షార్ట్ ఫార్మ్ వీడియోలు మరియు ఇంటరాక్టివ్ ఫార్మాట్లు అయిన ఏఆర్ క్రిటికల్ వంటివి 2022 ఫెస్టివ్ షాపర్లను గెలుచుకోనున్నాయి.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28,2022 : మెటా నేడు తమ వార్షిక కన్స్యూమర్ ఇన్సైట్స్ నివేదికను 2022 పండుగ సీజన్ కోసం విడుదల చేసింది. ఈ నివేదిక వెల్లడించే దాని ప్రకారం భారీ సంఖ్యలో పండుగ షాపర్లు నూతన బ్రాండ్లు, ఉత్పత్తులు మరియు ఆఫర్లను ఈ దీపావళి కోసం ప్రయత్నించాలనుకుంటున్నారు. ఈ నివేదిక వెల్లడించే దాని ప్రకారం 93% మంది దీపావళి షాపర్లు ఈ హాలీడే సీజన్లో నూతన బ్రాండ్‌ను ప్రయత్నించాలనుకుంటుంటే, 80%కు పైగా దీపావళి కొనుగొలుదారులు ఇప్పుడు నూతన బ్రాండ్లు, ఉత్పత్తులను ఆన్లైన్ లో కనుగొంటున్నారు. ఈ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం79%పైగా దీపావళి షాపర్లు మెటా టెక్నాలజీస్‌పై నూతన ఉత్పత్తులు మరియు బ్రాండ్లను కనుగొంటున్నారు.
ఈ అధ్యయన ఫలితాలను మెటా కోసం యుగవ్ చేసిన అధ్యయనం ద్వారా కనుగొన్నారు. ఈ అధ్యయనం ద్వారా పండుగ షాపింగ్ వ్యాప్తంగా మారుతున్న వినియోగదారుల ధోరణులను లోతుగా అధ్యయనం చేశారు.
ఈ అధ్యయనంలో కనుగొనబడిన కీలకమైన ధోరణుల ప్రకారం, భారతీయ పండుగ షాపర్లు అధికంగా ఇన్ల్ఫూయెన్సర్ ఆధారిత కంటెంట్, షార్ట్ ఫార్మ్ వీడియోలు, మెసేజింగ్ మరియు ఇంటరాక్టివ్ ఫార్మాట్లు అయినటువంటి ఏఆర్ వంటి వాటి చేత ప్రభావితమవుతున్నారు. ఈ అంశాలే 2022 లో దీపావళి షాపర్‌కు ఆసక్తి కలిగించడంతో పాటుగా వారి శ్రద్ధనూ పొందేందుకు కీలకమవుతున్నాయి.
మెటా వద్ద గ్లోబల్ బిజినెస్ గ్రూప్ (ఇండియా) డైరెక్టర్ అరుణ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘‘ఈ పండుగ సీజన్లో ఆశాజనక వాతావరణం కనిపిస్తుంది. ఇది వ్యాపారసంస్థలకు ఓ వరంగా నిలువనుంది. చిన్న, భారీ సంస్ధలు అత్యంత సవాల్‌తో కూడిన సూక్ష్మ ఆర్థిక వాతావరణంలో పెను సవాళ్లు ఎదుర్కొంటున్న వేళ ఇది శుభ పరిణామం. మేము ఇప్పటికే వ్యాపార సంస్థలతో కలిసి ఉత్సాహ పూరితమైన పనిని ఈ పండుగ సీజన్ ప్రచారాలలో భాగంగా ప్రారంభించాము. వినియోగదారులను చేరుకునేందుకు అత్యంత శక్తివంతమైన మార్గంగా డిజిటల్ నిలుస్తుంది. అది ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో వినియోగదారుడు కొనుగోలు చేయాలనుకున్నప్పటికీ అది ప్రభావం చూపుతుంది. మెటా సాంకేతికతలు ఈ దిశగా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. దాదాపు 440 మిలియన్ల మంది భారతీయులు కేవలం ఫేస్‌బుక్‌పై ఉండటం ద్వారా దీనిని సాధ్యం చేస్తున్నారు'' అని అన్నారు
వేవ్ మేకర్ ఇండియా, చీఫ్ డిజిటల్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫీసర్– విశాల్ జాకోబ్ మాట్లాడుతూ ‘‘గత 2–3 సంవత్సరాలలో భారీ డిజిటల్ స్వీకరణ, గణనీయంగా వినియోగదారుల ప్రవర్తనను సైతం మార్చింది. దీనితో సుప్రసిద్ధ బ్రాండ్లు కూడా తమ పండుగ ప్లానింగ్ ఏ విధంగా చేయాలనేది పునరాలోచిస్తున్నాయి. సామాజిక, వాణిజ్య వేదికల వద్ద డిజిటల్ వేదికలు విభిన్న విభాగాల వ్యాప్తంగా మార్కెటీర్ల శ్రద్ధను ఆకర్షిస్తుండటం చూశాము. సరైన కమ్యూనికేషన్‌తో వినియోగదారులను ఖచ్చితత్త్వంతో చేరుకోవడమనేది విజయానికి అత్యంత కీలకంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇది గందరగోళాన్ని తొలగిస్తుంది. దీనికోసం ఫేస్బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లు సరైన వేదికలుగా నిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా డీ2సీ బ్రాండ్లుకు ఇవి తోడ్పడుతున్నాయి’’అని అన్నారు.
అత్యంత కీలకమైన కన్స్యూమర్ ధోరణులు– ఈ దిగువ ఉదహరించబడిన కీలక ధోరణులన్నీ కూడా యుగవ్ రూపొందించిన దివాలీ సీజనల్ మూమెంట్ 2021 నివేదికలో భాగం (మెటా ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనం)
నూతన ఉత్పత్తులు, బ్రాండ్లను కనుగొనేందుకు వినియోగదారులు అధికంగా ఆన్‌లైన్‌ను వెదుకుతున్నారు :
· ఈ హాలీడే సీజన్లో నూతన బ్రాండ్లను ప్రయత్నించాలని 93% మంది దీపావళి షాపర్లు భావిస్తున్నారు.
· 80%కు పైగా దీపావళి షాపర్లు నూతన ఉత్పత్తి లేదా బ్రాండ్‌ను ఆన్లైన్లో కనుగొంటున్నారు మరియు 79% మంది దీపావళి షాపర్లు మెటా టెక్నాలజీస్‌పై వీటిని కనుగొంటున్నారు
· 68% కు పైగా దీపావళి మెగా సేల్స్ డే షాపర్లు మెటా ద్వారా రాయితీలు, ఆఫర్లను కనుగొంటున్నారు
దీపావళి షాపర్ కోసం ఇన్ఫ్లూయెన్సర్లు కొనుగోలు నిర్ణయాలను తీసుకుంటున్నారు :
· మెటా సాంకేతికతలపై ఇన్ల్ఫూయెన్సర్ ఆధారిత కంటెంట్‌ను 80%కు పైగా దీపావళి షాపర్లు చూస్తున్నారు
· 53%కు పైగా దీపావళి షాపర్లు ఇన్ల్ఫూయెన్సర్స్ ద్వారా ఆన్లైన్లో కొనుగోళ్లు చేస్తున్నారు
· 56% మంది వెల్లడించే దాని ప్రకారం పబ్లిక్ ఫిగర్స్/సెలబ్రిటీలు తమ కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపుతారని అంటున్నారు
షార్ట్ టర్మ్ వీడియోలు ఈ పండుగ షాపర్లపై అత్యంత బలమైన ప్రభావం చూపుతున్నాయి :
· ఈ అధ్యయనంలో పాల్గొన్న 50%కు పైగా షాపర్లు సంవత్సరంలో ఇతర సమయాలతో పోలిస్తే దీపావళి సమయంలో వీడియో కంటెంట్‌తో ఎక్కువగా నిమగ్నమై ఉన్నారు.
· 83%కు పైగా దీపావళి షాపర్లు మెటా టెక్నాలజీలపై షార్ట్ యూజర్ జనరేటెడ్ వీడియోలను వినియోగిస్తున్నారు.
మెసేజింగ్ ద్వారా రియల్ టైమ్ ఇంటరాక్షన్, ఫెస్టివ్ షాపర్లు తమ కొనుగోలు నిర్ణయాలను తీసుకోవడంలో సహాయపడుతుంది :
· 57% కు పైగా దీపావళి షాపర్లు ఇన్స్టెంట్ మెసేజింగ్‌తో అనుసంధానించబడిన వ్యాపార సంస్థల నుంచి తమ కొనుగోళ్లు చేయడానికి అమితాసక్తిని చూపుతున్నారు
· మెటా యొక్క మెసేజింగ్ సేవలను అధికంగా 2021 దీపావళి సమయంలో వ్యాపారాలతో అనుసంధానించబడేందుకు వినియోగించామంటున్నారు. 56% మంది స్పందనదారులు తాము వాట్సాప్‌ను వినియోగించామని చెబుతుంటే , 35% మంది తాము మెస్సెంజర్ మరియు ఇన్స్టాగ్రామ్ డీఎంను వ్యాపార సంస్థలతో కనెక్ట్ కావడం కోసం వినియోగించామంటున్నారు.
దీపావళి షాపింగ్ వేళ ఇంటరాక్టివ్ షాపింగ్ అనుభవాలను కోరుకుంటున్న భారతీయ పండుగ వినియోగదారులు
· 74% నమ్మేదాని ప్రకారం ఏఆర్/వీఆర్ ఉపకరణాలు తమ హాలీడే కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయి.
· దీపావళి వేళ ఆన్లైన్ షాపింగ్ చేసే వేళ 70% మంది ఏఆర్ లేదా వీఆర్ వంటి ఉపకరణాలు ఉపయోగించి ఉత్పత్తులను అన్వేషిస్తున్నారు.
దీపావళి షాపర్లు తమ మాతృభాషలో కమ్యూనికేషన్ ఉండాలని కోరుకుంటున్నారు :
· 53% మంది దీపావళి షాపర్లు షాపింగ్ వేళ తమ మాతృభాషలో సమాచారం పొందడం అత్యవసరమని భావిస్తున్నారు.
· ప్రతి నలుగురు దీపావళి షాపర్లలో ముగ్గురు ఈ సీజనల్ షాపింగ్ వేళ స్ధానిక భాషలలో ప్రకటనలు కోరుకుంటున్నారు.