Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితాంతం ఇతరులకు సేవలనందించే రీతిలో ప్రయోజనాలను అందిస్తూ 15 నుంచి 17 సంవత్సరాల వయసు కలిగిన వందమంది తెలివైన వారికి మద్దతునందిస్తుంది
తమ భావితరపు కమ్యూనిటీ లీడర్ల అంతర్జాతీయ కార్యక్రమాన్ని 22 నూతన దేశాలకు విస్తరించింది ; భారతదేశం నుంచి 2022 సంవత్సరానికిగానూ 9 మంది అంతర్జాతీయ విజేతలు
ముంబై, ఇండియా, సెప్టెంబర్ ,2022 : నేడు ష్మిత్ ఫ్యూచర్స్, రోడ్స్ ట్రస్ట్ తో భాగస్వామ్యం చేసుకుని రెండవ కోహర్ట్ 100 రైజ్ గ్లోబల్ విజేతలను ప్రకటించింది. అవకాశాల కోసం ఎదురుచూసే మేధావులను రైజ్ కనుగొంది. ఈ మేధావులకు ఇతరులకు సేవలనందించేందుకు తగిన మద్దతు కావాల్సి ఉంది. ష్మిత్ ఫ్యూచర్స్ యొక్క ప్రతిష్టాత్మక కార్యక్రమమిది మరియు ఎరిక్, ష్మిత్ నుంచి విస్తృత శ్రేణిలో ఒక బిలియన్ డాలర్ల దాతృత్వ నిబద్ధత కు చుక్కానిలా నిలుస్తూ తమ కార్యక్రమాల వ్యాప్తంగా ప్రతిభను అభివృద్ది చేస్తుంది.
మా 2022 రైజ్ గ్లోబల్ విజేతలలో నిరుపేద చిన్నారులలో అక్ష్యరాస్యత మెరుగుపరచడాన్ని లక్ష్యంగా చేసుకున్న యువత ; బయోఇన్ఫార్మిటిక్స్ వినియోగించి అల్జీమర్స్ ఔషధాల ప్రభావం ఊహించడం ; ఎనీమియాతో పోరాడే సస్టెయినబల్ గమ్మీ విటమిన్‌ను సృష్టించడం ; మానసిక ఆరోగ్య అపోహల పట్ల కమ్యూనిటీలకు అవగాహన కల్పించడం మరియు మరెన్నో అంశాలలో కృషి చేస్తోన్న యువత ఉన్నారు. ఈ సంవత్సరం 22 నూతన దేశాలు ప్రాతినిధ్యం వహించడంతో,ఈ గ్లోబల్ ప్రోగ్రామ్ మరింతగా తమ నెట్‌వర్క్‌ను విస్తృత శ్రేణి ప్రతిభావంతులైన యువ నాయకుల నడుమ విస్తరించడం కొనసాగిస్తోంది. ఈ యువ నాయకులలో విభిన్న బ్యాక్గ్రౌండ్స్కు చెందిన వ్యక్తులు సైతం ఉన్నారు. ఈసారి 170కు పైగా దేశాల నుంచి దరఖాస్తులు వచ్చాయి.
ష్మిత్ ఫ్యూచర్స్ యొక్క ప్రధాన లక్ష్యం, ఈ ప్రపంచాన్ని అత్యుత్తమంగా మార్చే అసాధారణ వ్యక్తులను గుర్తించడం. యువత మరీ ముఖ్యంగా 15–17 సంవత్సరాల వయసు గల వ్యక్తులపై దృష్టిసారించడం మరియు జీవితాంతం వారితో కలిసి ఉండటం ద్వారా , ష్మిత్ ఫ్యూచర్స్ పోర్ట్‌ఫోలియోలో ముందస్తు మరియు సుదీర్ఘమైన కార్యక్రమంగా రైజ్ నిలుస్తుంది.
ఈ సంవత్సరం, భారతదేశం నుంచి తొమ్మిది మంది అంతర్జాతీయ విజేతలను రైజ్ చూసింది మరియు టీచ్ ఫర్ ఇండియా లాంటి సంస్థలతో భాగస్వామ్యం చేసుకోవడాన్ని గౌరవంగా భావిస్తోంది. రైజ్ గురించి అవగాహన కల్పించేందుకు వారు ప్రయత్నాలు చేయడంతో పాటుగా యువత దరఖాస్తు చేయడానికి సైతం మద్దతునందించారు. అలాగే వారికి ఉత్సాహపూరితమైన ప్రోగ్రామింగ్ అవకాశాలు కల్పించి, దేశవ్యాప్తంగా రెండవ సంవత్సరం కూడా విజయవంతమయ్యేందుకు తోడ్పాటునందించారు.
‘‘మేము అసాధారణమైన ప్రతిభావంతుల కోసం ప్రపంచవ్యాప్తంగా వెదుకుతున్నాము. ఎందుకంటే, మేధావులు ఈ ప్రపంచం మెరుగుపడటంలో అసాధారణ ప్రభావం చూపగలరు. అదే సమయంలో ఈ ప్రపంచం ఎదుర్కొంటున్న అతి క్లిష్టమైన సమస్యలకు సైతం తగిన పరిష్కారాలను చూపగలరు’’ అని ఎరిక్ ష్మిత్, కో–ఫౌండర్, ష్మిత్ ఫ్యూచర్స్ అన్నారు.
‘‘ఈ ప్రపంచాన్ని అత్యుత్తమంగా మలచాలని తపించే అద్భుతమైన యువతను ఒకే దరికి చేర్చి నెట్‌వర్క్‌ను నిర్మించడం రైజ్ యొక్క అత్యంత కీలకమైన లక్ష్యాలలో ఒకటి. నేటి ప్రపంచపు అభివృద్ది అనేది ప్రజలు కలిసికట్టుగా పనిచేయడంపైనే ఆధారపడి ఉంటుంది’’ అని అన్నారు.
‘‘నేడు రైజ్ విజేతలను ప్రకటించడమన్నది ఈ ప్రక్రియ ముగింపులో భాగం కాదు, ఈ ప్రోగ్రామ్‌లో భాగమైన యువత తమ కార్యకలాపాల ఆరంభానికి సూచిక. ఈ ప్రపంచాన్ని అత్యుత్తమ ప్రదేశంగా మార్చేందుకు వారికి స్ధిరంగా అవకాశాలు లభిస్తూనే ఉంటాయి. వారు తమ విద్య కొనసాగించడంతో పాటుగా సహకారానికి తగిన మార్గాలను సైతం కనుగొనవచ్చు’’ అని వెండీ ష్మిత్, కో–ఫౌండర్, ష్మిత్ ఫ్యూచర్స్ మరియు ష్మిత్ ఫ్యామిలీ ఫౌండేషన్ అధ్యక్షులు అన్నారు.
‘‘భావి నాయకులుగా వారు నిలువగలరనే నమ్మకంతో ఉన్నాము. వారి సమ్మిళిత ఆలోచనలతో ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన సమస్యలకు సైతం తగిన పరిష్కారాలను అందించగలరు’’ అని అన్నారు.
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, అది ఏ రూపంలో ఉన్నా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంలో సహాయపడటానికి, ప్రతిభావంతులను ఎంపిక చేసి, తమ ప్రాజెక్టులలో భాగం చేయడానికి రైజ్ ఉద్దేశపూర్వకంగా తమ ప్రయత్నాలను చేస్తుంటుంది. విభిన్నమైన ఫోకస్ ఏరియాలు, నైపుణ్యాలు మరియు సమస్యల వ్యాప్తంగా విభిన్నమైన థృక్కోణంలో ప్రతిభను గుర్తించడాన్ని ఈ ప్రోగ్రామ్ గర్విస్తుంది.
కార్యకలాపాలు ప్రారంభమైన నాటి నుంచి తమ కమ్యూనిటీపైకి 170దేశాల నుంచి 1,50,000 మంది ప్రజలను ఆహ్వానించడంతో పాటుగా 69 దేశాల నుంచి 200 మంది విజేతలను ఎంపిక చేసింది. 2022 సంవత్సరానికి గానూ 1,20,000 రిజిస్ట్రేషన్ల నుంచి అత్యంత కఠినమైన పరిశీలనా ప్రక్రియ అంటే సర్వీస్ పాజెక్టుల సమీక్షలు, ప్రతిభావంతులను పరిశీలించడం, గ్రూప్ ఇంటర్వూల ఆధారంగా వీరిని ఎంపిక చేయడం జరిగింది. 2022 గ్లోబల్ విజేతలు తమ ప్రభావిత ప్రాజెక్టుల ద్వారా ప్రత్యేకంగా నిలిచారు. ఈ ప్రాజెక్టులు వైద్య ఆవిష్కరణలు మొదలు మానసిక ఆరోగ్యం, విద్య వరకూ ఉండటంతో పాటుగా ప్రతికూలతలను అధిగమించడంలో వారి బలాలు సైతం వెల్లడయ్యే రీతిలో ఉన్నాయి.
గత రెండు సంవత్సరాలుగా అంతర్జాతీయంగా విస్తరించిన కార్యక్రమంతో ష్మిత్ ఫ్యూచర్స్ మరియు ద రోడ్స్ ట్రస్ట్ లు ఈ ప్రోగ్రామ్ యొక్క మొదటి విజేతలను ఆస్ట్రియా, అజర్బైజాన్, బెలారస్, బల్గేరియా, బుర్కినా ఫాసో, ఘనా, ఇజ్రాయిల్ , ఇటలీ, జపాన్, కజకిస్తాన్, లెబనాన్, లిబ్యా, మయాన్మార్ (బర్మా), పరుగ్వే , పోలాండ్, రొమానియా, శ్రీలంక, స్విట్జర్లాండ్, తజకిస్తాన్, ట్యునీషియా, వియాత్నంల నుంచి చూసింది. 2021లో ఇండియా నుంచి ఎనిమిది మంది ప్రతిభావంతులను చూసింది. ఈ సంవత్సరం, రైజ్ ఇప్పుడు భారతదేశం నుంచి అదనంగా తొమ్మిది మంది రైజ్ గ్లోబల్ విజేతలను చూసింది. వీరిలో –
· వదోదర నుంచి ఆయుష్ అమర్ రాఠీ – నిరుపేదలకు లైంగిక విద్య, ఋతుక్రమం పట్ల అవగాహన కల్పించడానికి ఆయుష్ కృషి చేస్తున్నారు. దేశాభివృద్ధికి ఇది తప్పనిసరి.
· హైదరాబాద్ నుంచి ఆర్య దాట్ల – పర్యావరణ స్పృహ కలిగిన విద్యార్థులు ఏకతాటిపైకి రావడంతో పాటుగా సహకరించుకునేందుకు ఓ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ను ఆర్య అభివృద్ధి చేశారు. క్లైమెట్ యాక్షన్ ప్రాజెక్టుల కోసం అవసరమైన వనరులు, నిపుణులను సైతం కలిసే అవకాశం కూడా అందిస్తుంది.
· డకర్ నుంచి అథర్వ్ కశ్యప్ – అథర్వ్ ఓ ఈ–కామర్స్ యాప్‌ను సృష్టించడం ద్వారా మాతృమూర్తులు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు తోడ్పడుతున్నారు. దీని కారణంగా చిన్నారుల విద్య సైతం మెరుగుపడుతుంది.
· గురుగ్రామ్ నుంచి దివిత్ చోప్రా – ప్రాజెక్ట్ ఉమ్మీద్ ను దివిత్ అభివృద్ధి చేశారు. దీనిద్వారా అందుబాటు ధరలలో, స్వచ్ఛమైన మరియు మౌలిక వసతుల–స్వతంత్య్ర విద్యుత్‌ను ఐసోలేటెడ్ గ్రామీణ కమ్యూనిటీలకు వృద్ధి చేయబడిన అనోడిక్ సబ్స్ట్రాట్ ఫ్యూయల్ సెల్ ద్వారా అందిసుతన్నారు. వినూత్నమైన మైక్రోబియాల్ విద్యుత్ జనరేటర్ ఈ అనోడిక్ సబ్స్ట్రాట్ ఫ్యూయల్ సెల్.
· కోల్‌కతా నుంచి మనీజా ఖాన్ – గ్యాన్ ఎర్ అలో కార్యక్రమంకు మనీజా నేతృత్వం వహిస్తున్నారు. దీనితో పాటుగా స్టెమ్ విజువలిస్టిక్ ప్రోగ్రామ్‌ను స్టెమ్ విద్య ప్రాప్యత మెరుగుపరిచేందుకు, సామాజిక, ఆర్ధిక హోదాలతో సంబంధం లేకుండా అందుబాటులో ఉంచడం లక్ష్యంగా చేసుకున్నారు.
· న్యూఢిల్లీకి చెందిన రుద్రాక్ష్ మోహాపాత్ర – మెషీన్ లెర్నింగ్ నమూనాను రుద్రాక్ష్ డిజైన్ చేశారు. జియోస్పాటియల్ టెక్నిక్స్‌ను ఇది కలిగి ఉండటం వల్ల భూసార నష్టం, నీటి నిర్వహణను పాక్షిక నీటి వనరులు కలిగినప్రాంతాలలో కనుగొంటుంది. అంతేకాదు, ఏ ప్రాంతం ల్యాండ్‌స్లైడ్స్ ప్రభావం బారిన పడే అవకాశాలు ఉన్నాయో గుర్తించి, ప్రభావితమయ్యే ప్రజలకు మద్దతునందిస్తుంది.
· ఢిల్లీకి చెందిన సాహిబ్ప్రీత్ సింగ్ – సాహిబ్ ప్రీత్ ప్రత్యేకంగా ఏఐ, మెషీన్ లెర్నింగ్ వినియోగించి సాఫ్ట్వేర్ సృష్టించాడు. ఇది అగ్నిపర్వతాలలో జరుగుతున్న చర్యలను అవి పగలడానికి ముందుగానే గుర్తిస్తుంది
· న్యూఢిల్లీకి చెందిన శుభాంకర్ గుప్తా – ఎకో వోల్ట్ను శుభాంకర్ అభివృద్ధి చేశారు. ఇది ఏఐ టూల్. భారతదేశ వ్యాప్తంగా విద్యుత్ , నీరు పంపిణీకి ఇది భరోసా అందిస్తుంది.
· బెంగళూరుకు చెందిన సిద్థాంత్ అత్తావర్ – సిమ్ఎయిడ్ను సిద్ధాంత్ అభివృద్ధి చేశారు. ఇది డెసిషన్ సపోర్ట్ టూల్. పాలసీ మేకర్లు, పరిశోధలకు ఇది సహాయపడటంతో పాటుగా విభిన్నమైన వ్యాధుల కోసం అత్యుత్తమ ప్రమాణాలను గుర్తిస్తుంది. అతి తక్కువ ఖర్చు కలిగిన, అందుబాటు ధరల్లోని ఆరోగ్య సంరక్షణ సేవలను ప్రతి ఒక్కరికీ చేరువ చేస్తుంది.
విజేతల పూర్తి జాబితాను https://www.risefortheworld.org/global-winners/?utm_source=press-release&utm_organization=rise&utm_medium=organization&utm_campaign=rise3&utm_content=rgw-announcement-intl వద్ద కనుగొనవచ్చు.
‘‘ప్రపంచంలో అత్యంత కఠినమైన సవాళ్లకు తగిన పరిష్కారాలు ప్రపంచంలో అత్యంత తెలివైన వ్యక్తుల వద్ద ఉన్నాయని మేము నమ్ముతుంటాము’’ అని ఎరిక్ బ్రేవ్‌మాన్,సీఈఓ, ష్మిత్ ఫ్యూచర్స్ అన్నారు.
‘‘ అత్యుత్తమ, అతిపెద్ద మరియు ప్రపంచవ్యాప్తంగా అసాధారణమైన ప్రతిభ యొక్క అత్యంత శాశ్వతమైన పైప్‌లైన్ సృష్టించడం మరియు ఇతరుల జీవితాలకు సేవలనందించేందుకు తగిన అవకాశాలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్న మా కార్యక్రమంలో రైజ్ అంతర్భాగం’’ అని అన్నారు.
‘‘రైజ్‌తో మా భాగస్వామ్యం ద్వారా విద్యపరంగా అసమానతలను పోగొట్టాలనే మా ప్రయత్నాలను మరింతగా విస్తరిస్తుంది’’ అని షాహీన్ మిస్త్రీ, ఫౌండర్, సీఈఓ – టీచ్ ఫర్ ఇండియా అన్నారు.
‘‘ఇండియన్ రైజ్ గ్లోబల్ విజేతలను సాధించిన విజయాలను మేము వేడుక చేస్తున్నాము మరియు వారికి తగిన మద్దతు అందించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. వారు తమ ప్రతిభను ఇతరులు మరియు తమ కమ్యూనిటీలో వినియోగించేందుకు వినియోగించనున్నారు’’ అని అన్నారు.
‘‘అత్యంత ప్రతిభావంతులైన ఈ యువత నుంచి 100 మందిని ఎంపిక చేయడం పెను సవాల్‌గా నిలిచింది. ఈ ఎంపిక ప్రక్రియలో మాకు తోడ్పాటునందించిన భాగస్వాములందరికీ ధన్యవాదములు తెలుపుతున్నాము’’ అని డాక్టర్ ఎలిజిబెత్ కిస్, వార్డెన్ ఆఫ్ రోడ్స్ హౌస్– ఆక్స్ఫర్డ్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ –రోడ్స్ ట్రస్ట్ అన్నారు.
‘‘మా నూతన రైజ్ విజేతలు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. వారందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. వారి జీవితకాలపు ప్రయాణంలో భాగం కావడం ద్వారా వారి కమ్యూనిటీలకు సేవలనందించడానికి మద్దతునందిస్తూనే అత్యుత్తమ ప్రపంచాన్ని నిర్మించేందుకు తోడ్పడనున్నాము’’ అని అన్నారు.
అంతర్జాతీయ కమ్యూనిటీలో చేరేందుకు రైజ్‌కు ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 40కు పైగా దేశాల నుంచి అవకాశాలను అందుకోవచ్చు. ఈ తాజా రైజ్ గ్లోబల్ విజేతలు అదనపు వ్యక్తిగతీకరించిన మద్దతును సైతం పొందవచ్చు. వీటిలో అవసరార్ధపు స్కాలర్షిప్లు, మెంటార్షిప్, కెరీర్ డెవలప్మెంట్ అవకాశాలు, భావి వెంచర్స్కోసం సంభావ్య ఫండింగ్ , టెక్నాలజీ ప్యాకేజీలు మరియు మరెన్నో ఉన్నాయి. వీటి ద్వారా ఇతరులకు సేవ చేయడంలో కృషి చేసూ తమ లక్ష్యాలనూ చేరుకోవచ్చు.
తరువాత క్లాస్ కోసం దరఖాస్తులు అక్టోబర్ 2022 లో తెరువనున్నారు. దీని గురించిన మరింత సమాచారం, దరఖాస్తు ప్రక్రియను https://www.risefortheworld.org/apply-to-rise/?utm_source=press-release&utm_organization=rise&utm_medium=organization&utm_campaign=rise3&utm_content=rgw-announcement-intl వద్ద చూడవచ్చు.