Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాంసంగ్ సరికొత్త ది ఫ్రేమ్ టీవీని ఇంటికి తెచ్చుకోండి, నిజమైన ఆర్ట్ గ్యాలరీ అనుభూతి పొందండి; నచ్చినట్టు మార్చుకునే బెజెల్స్‌తో మీకు కావాల్సిన రీతిలో ఫ్రేమ్ చేయండి
మ్యాట్ డిస్ప్లే వస్తుంది, ఇది రిఫ్లెక్షన్స్‌ను నిర్మూలిస్తుంది, ఫ్రేమ్ టీవీలో వచ్చే చిత్రం నిజమైనదా అని పోల్చుకోవడం కష్టంగా చేస్తుంది
మీ లివింగ్ స్పేస్‌కు తగినది ఎంచుకునేందుకు వీలుగా అనుకూలమైన మ్యాగ్నెటిక్ బెజెల్స్ అందిస్తుంది
అన్ని ఫ్రేమ్ టీవీ మోడల్స్‌తో పొందండి రూ.7,690 లోపు విలువైన ఫ్రీ బెజెల్, సాంసంగ్ గ్యాలెక్సీ A32 75 ఇంచ్ మోడల్‌తో రూ.21,490 విలువైనది, సాంసంగ్ గ్యాలెక్సీ A03 65 ఇంచ్ మోడల్‌తో రూ.9,499 విలువైనది
గురుగ్రామ్, ఇండియా – సెప్టెంబర్ 28, 2022 – భారతదేశంలోని అతిపెద్ద కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సాంసంగ్ మీ లివింగ్ రూమ్ అందాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు సరికొత్త ప్రీమియం లైఫ్‌స్టైల్ ఎడిషన్ టీవీ ది ఫ్రేమ్ తీసుకువచ్చింది. ది ఫ్రేమ్ లైఫ్‌స్టైల్ టీవీని ఆఫ్ చేసినప్పుడు అది ఒక కళాఖండంగా నిలుస్తుంది, ఆన్ చేసినప్పుడు టీవీగా మారుతుంది. అనుకూలంగా మార్చుకునే బెజెల్స్, మ్యాట్ డిస్ప్లే, ఆర్ట్ మోడ్, సాంసంగ్ ప్రొప్రైటరీ QLED టెక్నాలజీతో తో కూడి ఉంటుంది ది ఫ్రేమ్ టీవీ ఒక స్టేట్మెంట్ పీస్‌గా నిలుస్తూ మీకు మైమరపింపజేసే వినోదాన్ని అందిస్తుంది. ది అద్భుతమైన స్థానిక, గ్లోబల్ ఆర్ట్ వర్క్ లైనప్‌తో ఇది ఇంటిని ఆర్ట్ గ్యాలరీగా మార్చి కళాత్మకతను అందిస్తుంది.
మీలోని కళాప్రియత్వం కోసం డిజైన్ చేసిన ది ఫ్రేమ్ టీవీ అనేక అనుకూలతలు, మ్యాగ్నెటిక్ బెజెల్స్‌తో మీకు నచ్చిన రీతిలో ఫ్రేమ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. అలాగే మీ స్పేస్‌కు తగినట్టుగా మీకు నచ్చిన రంగు మార్చుకోవచ్చు. స్లిమ్ పిక్చర్ ఫ్రేమ్‌లా డిజైన్ ఈ టీవీలోని సొగసైన, మోడ్రన్ ఫ్రేమ్ డిజైన్ మీ ఇంటి అందాన్ని పెంచుతుంది.
ఫ్రేమ్ టీవీలోని ఇన్ బిల్ట్ ఆర్ట్ స్టోర్ మీకు నచ్చిన వ్యక్తిగత ఆర్ట్ కలెక్షన్‌కు వెసులుబాటు కల్పిస్తుంది. ఇందులో భారతీయ విఖ్యాత బిహార్‌కు చెందిన మధుబని, మధ్యప్రదేశ్‌కు చెందిన గోండ్, ఒడిషా, బెంగాల్‌కు చెందిన పట్టచిత్ర వంటి జానపద కళలకు చెందిన 1600 ఖండాలతో కూడిన లైబ్రరీ ఉంది. ఇది ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. అంతే కాకుండా మీరు మీ కుటుంబ చిత్రాలు లేదా విహార ఫొటోగ్రాఫ్స్ అప్లోడ్ చేసి డిస్ప్లేలో పెట్టుకోవచ్చు. మీ నచ్చిన చిత్రాల కోసం ఇందులో ఐదు రకాల మ్యాట్ లేఔట్ ఆప్షన్స్‌తో పాటు 16 వైవిధ్యభరితమైన రంగుల ప్యాలెట్ వాటికి మరింత వాస్తవితకను తీసుకువస్తాయి. ఈ టీవీలోని ఎంతో సరళమైన, స్పష్టమైన హోమ్ స్క్రీన్ ఫీచర్, ఆర్ట్ స్టోర్ ద్వారా సులభమైన మరింత సౌకర్యవంతమైన ఆర్ట్ అనుభూతిని అందిస్తుంది.
మీ విలాసవంతమైన లివింగ్ స్పేస్‌కు మరిన్ని వన్నెలు అద్దుతుంది ఫ్రేమ్ టీవిలో కొత్తగా ప్రవేశపెట్టిన మ్యాట్ డిస్ప్లే. ఇది స్క్రీన్ నుంచి రిఫ్లెక్షన్ తొలగించి కళాఖండానికి టెక్చర్ అనుభూతిని సమకూర్చి నిజమైన ఆర్ట్ గ్యాలరీ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. అంతే కాకుండా ఈ సరికొత్త ఫ్రేమ్ టీవీ స్క్రీన్‌పై సహజ కాంతి లేదా పరిసర కాంతి ప్రతిబింబానికి ఇప్పుడు కాలం చెల్లినట్టే. ఈ 4K QLED టీవీ 100% కలర్ వాల్యూమ్‌తో కలర్స్, మెరుగైన కాంట్రాస్ట్, మచ్చలేని డిటెయిల్స్‌తో అసాధారణమైన చిత్ర నాణ్యత అందిస్తుంది. – వీటి కోసం మీరు మీ కర్టెన్స్ లాగాల్సిన పనిలేదు.
ది ఫ్రేమ్ టీవీ సరికొత్త ఎడిషన్ 43-ఇంచెస్, 50-ఇంచెస్, 55- ఇంచెస్, 65- ఇంచెస్, 75- ఇంచెస్ స్క్రీన్ సైజ్‌లో Samsung.com, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహ ప్రముఖ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది.
“ఫ్రేమ్ అనేది ఒక సౌందర్య అద్భుతం, స్థానిక, అంతర్జాతీయ ప్రసిద్ధ చిత్రాలను కళాభిమానులు తమ గోడలపై సజీవంగా నిలుపుకునేందుకు వీలుగా రూపొందించబడింది. 4K QLED టెక్నాలజీ ఇంట్లోనే మైమరపింపజేసే వినోద అనుభూతి పొందేలా నాణ్యమైన చిత్రాన్ని అందిస్తుంది. కొత్తగా ప్రవేశపెట్టిన మ్యాట్ డిస్ప్లే వినియోగదారులు లైట్ రిఫ్లెక్షన్ గురించి చింతించకుండా ఎక్కడైనా ఈ టీవీ అమర్చుకునే వెసులుబాటు కల్పిస్తుంది. మా సరికొత్త ఆవిష్కరణ ది ఫ్రేమ్‌తో వినియోగదారులను ఆకట్టుకోవడంతో పాటు భారతదేశంలో ప్రీమియం లైఫ్‌స్టైల్ టెలివిజన్ సెగ్మెంట్లో మా నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తుందని మేము విశ్వసిస్తున్నాము, ”అని అన్నారు సాంసంగ్ ఇండియా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్‌దీప్ సింగ్.
100% కలర్ వాల్యూమ్‌తో కలర్స్, మెరుగైన కాంట్రాస్ట్ మచ్చలేని వివరాలు అందించే క్వాంటం డాట్ టెక్నాలజీ శక్తి అసాధారణమైన చిత్ర నాణ్యతతో మైమరపింపజేసే టీవీ వీక్షణ అనుభూతి అందిస్తుంది. ఇది సాంసంగ్ శక్తివంతమైన క్వాంటం ప్రాసెసర్ 4K, 4K AI అప్ స్కేలింగ్ సామర్థ్యాలు, స్పేస్ ఫిట్ సౌండ్ కలిగి ఉంది. ఇది మీ గది వాతావరణాన్ని విశ్లేషించి దానికి అనుగుణంగా తర్వాత సౌండ్ సెట్టింగ్‌లను ఆటో-ఆప్టిమైజ్ చేస్తుంది. విద్యుత్ పొదుపు చేసేందుకు ఇందులోని మోడ్రన్ సెన్సర్ మీరు గదిలో ఉన్నప్పుడు ఆటోమ్యాటిక్‌గా మీ ఆర్ట్‌వర్క్ డిస్ప్లే చేస్తుంది, మీరు గది నుంచి వెళ్లగానే తనంతటతానే ఆఫ్ అయిపోతుంది. అంతేకాకుండా, బ్రైట్నెస్ సెన్సార్ పరిసర కాంతిని గుర్తించి గదిలోని లైటింగ్‌తో సంబంధం లేకుండా కళాకృతి అసలు రూపాన్ని నిలుపుకోవడానికి స్క్రీన్ బ్రైట్నెస్, కలర్ టోన్ ఆటామ్యాటిక్గా అడ్జస్ట్ చేస్తుంది. సూర్యోదయం/ సూర్యాస్తమ సమాచారాన్ని బట్టి ఇందులోని ఐ కంఫర్ట్ మోడ్ స్క్రీన్ బ్రైట్నెస్, టోన్‌ను ఆటోమ్యాటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. ఐ కంఫర్ట్ మోడ్‌తో మీరు రాత్రిపూట టీవీ చూస్తే బ్లూ లైట్ స్థాయి తగ్గుతుంది మీ చిత్రాలు హృద్యంగా కనిపిస్తాయి. ఇది కంటిపై ఒత్తిడిని తగ్గించడంలో సాయపడుతూనే క్రిస్టల్ క్లియర్ చిత్రాలు అందిస్తుంది.
ట్రూ డాల్బీఆట్మోస్ ® ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ ఫీచర్‌తో ఫ్రేమ్ టీవీ యాక్షన్‌తో కూడిన సౌండ్ ఔట్పుట్ అందిస్తుంది. ఇది టీవీలోని అన్ని మూలల నుంచి సౌండ్ ట్రాక్ చేస్తుంది. స్క్రీన్ చుట్టు ఉండే మల్టీ చానెల్ స్పీకర్స్ యాక్షన్‌కు దగ్గరగా ఉండేలా మోషన్‌ను ట్రాస్ చేస్తాయి.
సాంసంగ్ అద్భుతమైన ఈ సరికొత్త టెలివిజన్‌లోని ఆర్ట్ మోడ్ ఏ చిత్రానైనా మెరుగ్గా మార్చేస్తుంది. ప్రపంచప్రఖ్యాత కళాఖండాలతో పాటు పేరెన్నికగన్న బిహార్‌కు చెందిన మధుబని, మధ్యప్రదేశ్‌కు చెందిన గోండ్, ఒడిషా, బెంగాల్‌కు చెందిన పట్టచిత్ర వంటి జానపద కళలకు చెందిన 1600 ఖండాలతో సదా విస్తరిస్తూ పోయే లైబ్రరీ నుంచి వినియోగదారులు తమకు నచ్చిన వాటిని ఎంచుకొని డిస్ప్లే చేసుకోవచ్చు. అంతే కాదు కుటుంబ ఫొటొలు, వ్యక్తిగత ఫొటోలను మై కలెక్షన్ నుంచి ది ఫ్రేమ్ టీవీలోకి అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ సరికొత్త ఎడిషన్ ప్రీమియం టెలివిజన్‌లోని మ్యాట్ క్యాన్వాస్‌ను వారు తమ చిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్‌గా ఉపయోగించుకోవచ్చు.
సాంసంగ్ ప్రీమియం టెలివిజన్ల శ్రేణిలో సరికొత్తగా ప్రవేశించిన ది ఫ్రేమ్ టీవీ మీ జీవనశైలిని ఉన్నతపరిచే లక్ష్యంతో అనేక స్మార్ట్ ఫీచర్లతో కూడి ఉంది. గూగూల్ డ్యూయో శక్తితో కూడిన వీడియో కాలింగ్ ఫీచర్ ద్వారా మీరు మీ బంధువులు, ప్రియమైన వారితో కనెక్ట్ కావచ్చు.
అందుబాటు
ఈ లేటెస్ట్ ఫ్రేమ్ టీవీలు సాంసంగ్ అధికారిక ఆన్లైన్స్టోర్తో పాటు సాంసంగ్ షాప్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహ దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ రిటెయిల్ స్టోర్స్‌లో 43-ఇంచ్, 50- ఇంచ్, 55- ఇంచ్, 65- ఇంచ్, 75- ఇంచ్ స్క్రీన్ సైజుల్లో లభిస్తాయి.
సాంసంగ్ అధికారిక ఆన్‌లైన్‌స్టోర్, సాంసంగ్ షాప్‌లో కొనుగోలు చేసే వినియోగదారులు ప్రముఖ బ్యాంకుల నుంచి 20% వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
ది ఫ్రేమ్ టీవీ కొనుగోలు చేసే వినియోగదారులు సరికొత్త ఫ్రేమ్ టీవీ మోడల్స్‌తో రూ.7,690 లోపు విలువైన బెజెల్ ఉచితంగా పొందవచ్చు, సాంసంగ్ గ్యాలెక్సీ A32 75 ఇంచ్ మోడల్‌తో రూ.21,490 విలువైనది, సాంసంగ్ గ్యాలెక్సీ A03 65 ఇంచ్ మోడల్‌తో రూ.9,499 విలువైనది అందుకోవచ్చు.
వారెంటీ
ఫ్రేమ్ టీతో వినియోగదారులు 3 సంవత్సరాల వారెంటీతో పాటు 10 సంవత్సరాల నో స్క్రీన్ బర్న్ వారెంటీ కూడా అందుకుంటారు.
ముఖ్యమైన ఫీచర్లు
మ్యాట్ డిస్ప్లేతో యాంటీ-రిఫ్లెక్షన్
మీ ఆర్ట్‌వర్క్ కావచ్చు లేదా మీకు నచ్చిన షో కావచ్చు రాత్రివేళ లైట్స్ కాంతిలో ఎలా కనిపిస్తుందో అంతే చక్కగా ఉదయం వేళల్లోనూ కనిపిస్తుంది. దీనిలోని యాంటీ రిఫ్లెక్షన్ టెక్నాలజీ, మ్యాట్ డిస్ప్లే ఫిల్మ్ ప్రీమియం మ్యాట్ ఫినిషన్ మీ స్క్రీన్ లైట్ డిస్ట్రాక్షన్‌ను పరిమితం చేసే గ్లేర్ ఎఫెక్ట్స్ తగ్గిస్తాయి.
కళాప్రియులను కట్టిపడేసే ఆర్ట్ మోడ్
సాంసంగ్ కలెక్షన్ నుంచి ఎంచుకోండి లేదా మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే మీ సొంత చిత్రాలను అప్లోడ్ చేయండి. సాంసంగ్ ఆర్ట్ స్టోర్ సబ్స్క్రిప్షన్ ద్వారా ప్రముఖ, వర్ధమాన కళాకారులు రూపొందించిన 1,600లకు పైగా ఉన్న ఆధునిక, క్లాసిక్ కళాఖండాల లైబ్రరీకి అపరిమిత యాక్సెస్ లభిస్తుంది.
నచ్చినట్టుగా మార్చుకునే బెజెల్స్‌తో సరైన మూడ్‌ని సెట్ చేయండి
మీ సౌందర్యం, మానసిక స్థితి లేదా సందర్భం ఏదైనప్పటికీ, 7 విభిన్న రంగులతో కూడిన మోడ్రన్ లేదా బెవెల్డ్ బెజెల్స్ నుంచి మీకు నచ్చినది ఎంచుకోండి. మాగ్నెటిక్ బెజెల్ స్నాప్ చేయడం సులభం, డిజైన్ అప్డేట్స్ను క్షణాల్లో అందిస్తుంది.
సాంసంగ్ కలెక్షన్‌తో మీ డిస్ప్లేను మీకు నచ్చినట్టుగా చేసుకోండి
మీ ఫోన్ లేదా USB ఫ్లాష్ డ్రైవ్‌తో మీ సొంత ఫొటోగ్రఫీ లేదా కుటుంబ ఫొటోలు, ఇతర జ్ఞాపకాలను మీరు సులభంగా అప్లోడ్చేసుకోవచ్చు. మై కలెక్షన్లో ఉండే 12GB స్టోరేజ్‌తో మీరు సొంతంగా రూపొందించిన కళాఖండాలను షేర్ చేసుకోవచ్చు.
ఐ కంఫర్ట్ మోడ్‌తో విశ్రాంతి
సరికొత్త ది ఫ్రేమ్ QLED 4Kలోని ఐ కంఫర్ట్ మోడ్ సూర్యోదయం, సూర్యాస్తమ సమయాలకు అనుగుణంగా డిస్ప్లే బ్రైట్నెస్ను ఆటోమ్యాటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది.
100% కలర్ వ్యాల్యూమ్‌తో ట్రూ-టూ-లైఫ్ పిక్చర్ క్వాలిటీని ఆస్వాదించండి
100% కలర్ వాల్యూమ్‌లో ఒక బిలియన్ షేడ్స్ ద్వారా బ్రిలియంట్ కలరింగ్‌కు వెసులుబాటు కల్పిస్తుంది QLED టెక్నాలజీ. కాంతిని స్పష్టమైన రంగుగా మార్చే క్వాంటం డాట్ టెక్నాలజీ మీకు అందమైన చిత్రాన్ని అందించడమే కాదు సీన్‌ను స్పష్టంగా, ప్రకాశవంతంగా చేస్తుంది.
క్వాంటమ్ HDRతో బ్రిలియంట్ పిక్చర్ క్వాలిటీ
HDTVని దాటి క్వాంటమ్ HDR వైపు వెళ్లండి. ఇది మీకు అందిస్తుంది కలర్, కాంట్రాస్ట్‌లో మరింత విస్తృత శ్రేణి. మీ చిత్రం ఎలా ఉంటుందో చూసేందుకు బ్రిలియంట్ పాజిబిలీట్స్ సెట్ చేసుకోండి.
మోషన్ సెన్సార్స్‌తో స్మార్ట్ డిస్ప్లే
ఇంధనాన్ని సమర్థవంతంగా ఉపయోగించేందుకు ఇంటెలిజెంట్ మోషన్ సెన్సర్స్ సాయపడతాయి. మీరు గదిలో ఉన్నప్పుడు మీ ఆర్ట్ కనిపించేలా డిస్ప్లే పెట్టుకోండి, లేనప్పుడు ఆఫ్ అయ్యేలా చేసుకోవచ్చు.