Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణలో తన తొలి ఫుల్ఫిల్మెంట్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసినట్లు ఈకామ్ ఎక్స్ప్రెస్ వెల్లడించింది. దక్షిణాదిలో ఇది తమ ఆరో నిత్యావసరాల కేంద్రమని ఆ సంస్థ పేర్కొంది. ఈ అధునాతన గిడ్డంగిని మెడ్చల్లో 2 లక్షల చదరపు అడుగులు విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. దీని ద్వారా 100 డార్క్ స్టోర్లకు నిత్యావసరాల సరఫరాకు వీలుంటుందని పేర్కొంది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1000 మందిక ఉపాధి లభించనుందని వెల్లడించింది. బి2బి, బి2సి పద్దతిలో వస్త్రాలు, పరికరాలు, కస్మోటిక్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తదితర ఉత్పత్తులను ఇక్కడ నిల్వ చేయనుంది.