Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇన్వెస్టర్ల సిప్, ఎస్టిపి, ఎస్డబ్ల్యుపి కోసం స్మార్ట్ ఫెసిలిటీని ప్రారంభించినట్లు కోటక్ మ్యూచువల్ ఫండ్ తెలిపింది. ''దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టడానికి ఈక్విటీ వాల్యుయేషన్-ఆధారిత పెట్టుబడి విధానం కోసం చూస్తున్న పెట్టుబడిదారులకు తాజా స్మార్ట్ ఫెసిలిటీ సహాయపడుతుంది.
క్రమబద్ధమైన పెట్టుబడులకు ఇది చాలా సరళమైన, శక్తివంతమైన సాధనం, దీన్ని అర్థం చేసుకోవడం, పెట్టుబడి పెట్టడం కూడా సులభం. రాబోయే రోజుల్లో పెట్టుబడిదారు లు ఈ ఆఫరింగ్ నుండి ప్రయోజనం పొందుతారని కచ్చితంగా అను కుంటున్నాను'' అని కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ గ్రూప్ ప్రెసిడెంట్, ఎండి నీలేష్ షా పేర్కొన్నారు.