Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బజాజ్ ఎలక్ట్రానిక్స్ స్టోర్లను నిర్వహించే ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్ అక్టోబర్ 4-7 తేదిల్లో ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)కు రానుంది.ఈ ఇష్యూలో ఈక్విటీల ధరల శ్రేణిని రూ.56-59 గా నిర్ణయించింది. దీని ద్వారా రూ.500 సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ నిధుల్లో రూ.111.44 కోట్లు మూలధన వ్యయాలకు, రూ.220 కోట్లు వర్కింగ్ క్యాపిటల్‌కు అవసరాలకు, రూ.55 కోట్లు రుణాల చెల్లింపులకు ఉపయోగించనున్నట్లు తెలిపింది. మదుపర్లు కని ష్ఠంగా 254 షేర్లకు బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుందని వెల్లడించింది.