Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగని రూపాయి పతనం
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో సెషన్లోనూ నష్టాల పాలయ్యాయి. మరోవైపు డాలర్‌తో రూపాయి పతనం కొనసాగింది. బుధవారం సెషన్లోనూ సెన్సెక్స్, నిఫ్టీలు ప్రారంభం నుంచే అమ్మకాల ఒత్తిడితో నేల చూపులు చూశాయి. తుదకు బిఎస్ఇ సెన్సెక్స్ 509 పాయింట్లు క్షీణించి 56,598కి దిగజారింది. ఇదే బాటలో ఎన్ఎస్ఇ నిఫ్టీ 149 పాయింట్లు తగ్గి 16,859 వద్ద ముగిసింది. బిఎస్ఇలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.4 శాతం చొప్పున ప్రతికూలతను ఎదుర్కొన్నాయి.
ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు భారీగా నష్టపోయాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 40 పైసలు కోల్పోయి రూ.81.93 వద్ద ముగిసింది. ఒక దశలో రూ.81.95 పైసల కనిష్ట స్థాయికి పడిపోయింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడానికి తోడు భారత మార్కెట్ల వరుస పతనం, ఎఫ్ఐఐలు తరలిపోవడం, వాణిజ్య లోటు పెరగడం, విదేశీ మారకం నిల్వల్లో తగ్గుదల రూపాయిపై ఒత్తిడిని పెంచుతున్నాయి.