Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పండుగ సీజన్ కోసం ఎస్బీఐ కార్డు అనేక ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రవేశ పెట్టింది. ఈ ఆఫర్లు అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయి. ఆన్ లైన్ లో, ఆఫ్ లైన్ లో టైర్ 1, 2, 3కి చెందిన 2600 నగరాల్లో 1600 కంటే ఎక్కువ వస్తువులపై ఈ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్లలో ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్, బంగారు ఆభరణాలు, ట్రావెల్ మార్కెట్లలో అనేక రకాల వస్తువులు, సేవలు అందుబాటులో ఉంటాయి. కొన్ని ఎంపికచేసిన వస్తువులపై 22.50% వరకు కూడా క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి. 'అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్' కోసం SBI Card అమెజాన్ లో ప్రత్యేక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఇంతేకాకుండా SBI Card. . ఫ్లిప్ కార్ట్, శాంసంగ్ మొబైల్, రిలయన్స్ ట్రెండ్స్, పాస్టలూన్స్, రేమండ్స్, ఎజ్, సామ్ సంగ్, సోని, హెపీ, Make My Trip, goibibo వంటి ప్రఖ్యాత బ్రాండ్లతో సహా దాదాపు 28 కీలక అంతర్జాతీయ, దేశీయ బ్రాండ్ కొనుగోళ్లపై విభిన్న ఆఫర్లను పొందొచ్చు. ఎస్ బీఐ కార్డు ఈఎంఐ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. వినియోగదారులు 25కు పైగా ఎలక్ట్రానిక్స్, మొబైల్ బ్రాండ్లలో ఎటువంటి అదనపు వడ్డీ లేకుండా ఈఎంఐ సౌకర్యాన్ని పొందవచ్చు. కొన్ని ఎంపిక చేసిన ప్రాంతీయ వ్యాపారుల వద్ద కూడా ఈ ఎంఐ | లావాదేవీలపై 15 % క్యాష్ బ్యాక్ ఆఫర్ను వినియోగదారులు పొందవచ్చు.