Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ కంటేశ్వర్
మెడికవర్ హాస్పిటల్స్ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మినీ వాకథాన్ ని పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు హాజరై జెండా ఊపి 4 కిలోమీటర్ల వాకింగ్ ను గురువారము ప్రారంభించారు. గుండె సంరక్షణ గుండె-ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించడానికి ఈ యొక్క కార్యక్రమం స్థానిక హనుమాన్ జంక్షన్ నుండి కలెక్టరేట్ సర్కిల్ వరకు "USE HEART FOR EVERY HEART" అనే నినాదంతో ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ యొక్క ర్యాలీలో సుమారుగా 200 మందికి పైగా యువకులు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిధి కే అర్ నాగరాజు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి నాణ్యమైన సేవలు అందిస్తున్న మెడికవర్ హాస్పిటల్స్ ఇటువంటి అవగాహనా ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరం అని ఈరోజు వృత్తి పరమైన ఒత్తిడి కి గురి కాకుండా నిత్యం వ్యాయామం కాళీ నడకకు ప్రాధాన్యత నిచ్చి అట్లాగే 50సంవత్సరాలు పైబడి వున్న ప్రతీ వ్యక్తి గుండె పరీక్షలు నిర్వహించుకుని అరగ్యానికి ప్రధాన్యత ఇవ్వాలని అన్నారు.ప్రతి ఒక్కరు సాద్యమైనంత వరకు గుండె పై వత్తిడిపడకుండా చూసుకోవడం మంచిది అని అన్నారు.ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని అన్నారు. అనంతరం డాక్టర్ రవికిరణ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ మాట్లాడుతూ.. గుండపోటు కు గల కారణాలు శరీరక శ్రమ లేకపోవడం, వంశపారాంపర్యం గా గుండె వ్యాధులు ఉండడం, ఆహారం తీసుకోవడం లో సమయపాలన లేకుండటం, సిగరెట్, ఆల్కహాల్ వంటి దురవ్యాసనాలు వున్నవారు తగు జాగ్రత్తలు తీసుకొని జీవనశైలి లో మార్పులతో గుండెను కాపాడుకోవచ్చని తెలియజేసారు.డాక్టర్ సందీప్ గుండెవ్యాధి నిపుణులు మాట్లాడుతూ గుండె వ్యాదులను గుర్తించి సరైన సమయంలో హాస్పిటల్ కి వెళితే మనం ఎలాంటి స్ట్రోక్ బారిన పడకుండా ఉంటాం. గుండె ఆరోగ్యాన్ని సమీక్షించుకోండి . ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా గుండెజబ్బుల బారినపడకుండా ఉండొచ్చు. గుండె ఆరోగ్యం కోసం కనీసం 30 నుంచి 40 నిమిషాలు వారానికి కనీసం 5 నుంచి 6 రోజులు వ్యాయామం చేయాలి దీనివల్ల ఒత్తిడి & డిప్రెషన్ తగ్గుతుంది అని తెలియజేసారు.ఈ ర్యాలీ కార్యక్రమంలో డాక్టర్ అవీన్ ఓపెన్ హార్ట్ సర్జన్ , విద్యాసాగర్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రవికిరణ్ , డాక్టర్ వాను, కళ్యాణ్ డాక్టర్,మేనేజ్మెంట్ శ్రీనివాస్ శర్మ, స్వామి, లహరి సిబ్బంది పాల్గొన్నారు