Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రతీ ఇంటి యజమాని కూడా తన వ్యక్తిత్వాన్ని, తన ప్రాథమ్యాలను చాటిచెప్పేలా తన ఇంటిని అలంకరించుకోవాలని భావిస్తుంటారు. కొనుగోలుదారులు చాలా మంది షైనీ ఫినిష్ కావాలని కోరుకుంటూ ఉంటారు, కాకపోతే అదెంతో ఖరీదైనదని, ప్రీమియం ఉత్పాదన అని అపోహపడుతుంటారు. అందుబాటు ధరలకే మంచి షైనింగ్ ను అందించేలా తమ చుట్టూరా ఉన్న ఉత్పాదనలపై వారికి అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. ఈ ఆలోచనతోనే ఇప్పుడు ఏషియన్ పెయింట్స్, అందుబాటు ధరల్లోనే లభ్యమయ్యే తన ట్రాక్టర్ షైన్ (లోప లి గోడల కోసం), ఏస్ షైన్ (బయటి గోడల కోసం)లకు సంబంధించి తన నూతన ప్రచార కార్యక్రమంపై వెలు గులు ప్రసరిస్తోంది. ఈ పెయింట్లు వినియోగదారులకు దీర్ఘకాలం పాటు మెరుపును సహేతుక ధరకే అందిస్తా యి. ఇళ్లు కనిపించే తీరును మార్చివేసే ఈ పెయింట్లు మూడేళ్ల పనితీరు వారంటీతో లభ్యమవుతాయి, అంతే కాదు, ఇంటికి విలాసవంతమైన లుక్ ను కూడా అందిస్తాయి.
ఒగ్గివీ ఇండియాచే రూపకల్పన చేయబడిన ఈ టీవీసీ ప్రత్యేకించి దక్షిణ భారతదేశ మార్కెట్ కోసం రూపొందిం చబడింది. ఇందులో మనం మిస్టర్ బాలా స్టోరీని చూడవచ్చు. ప్రముఖ నటుడు, కమెడియన్ బడవ గోపి ఈ పాత్రను పోషించారు. ఆయన ఇల్లు ఏషియన్ పెయింట్స్ ట్రాక్టర్ షైన్, ఏస్ షైన్ ఎమల్సియన్స్తో పె యింట్ చేయబడిన నేపథ్యంలో ఇది కొనసాగుతుంది. ఆ గోడల మెరుపు ఆయన ముఖంపై గర్వంగా ప్రతి ఫలిస్తుంది. తన ఇల్లు ఎంత విలాసవంతంగా ఉందో అంటూ మురిసిపోతాడు. ‘‘షైనీ వాల్ ఫినిష్ అనేది సా ధారణంగా ప్రీమియంతో ముడిపడి ఉంటుంది, కాకపోతే అందుబాటు ధరలోనూ అది లభిస్తుంది’’ అనే కీలక సందేశాన్ని ఇది చాటి చెబుతుంది.
ఇంటి యజమానులు పండుగ సందర్భంగా తమ ఇంటి గోడలను తిరిగి అలంకరించాలనుకున్నప్పుడు, తమ గదులకు మరింత మెరుపును జోడించాలనుకున్నప్పుడు ఏషియన్ పెయింట్స్ అందించే ట్రాక్టర్ ఎమిల్సియన్, ఏస్ షైన్ పెయింట్స్కు మించినవి మరొకటి లేవు.
ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ అమిత్ సింగ్లే ఈ సందర్భంగా తన ఆలోచనలను పంచుకుంటూ, ‘‘ఇళ్లు ఆయా వ్యక్తుల వ్యక్తిత్వాలను, అభిరుచులను ప్రతిబింబిస్తాయి. గోడలకు పెయింట్ చేయించేటప్పుడు ప్రతి ఒక్కరికీ తాము ఎలా పెయింట్ చేయించుకోవాలనే విషయంలో ఒక అభిప్రాయం ఉంటుంది. కాకపోతే వారు దాన్ని తగ్గించుకుంటారు. ఏషియన్ పెయింట్స్ ట్రాక్టర్, ఏస్ షైన్ లతో ప్రతీ ఇంటి యజమాని కూడా తమ ఇంటి గోడలకు మరింత మెరుపును జోడించవచ్చు, మరింతగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండానే. ఈ సందేశాన్ని ఈ నూతన క్యాంపెయిన్ ఎంతో బలంగా అందిస్తుంది. పండుగల సందర్భాల్లో వినియోగదారు లు తమ ఇళ్లకు కొత్త హంగులు జోడించాలని చూస్తుంటారు. మేం అందించే తక్కువ వ్యయపూరిత పెయింట్ శ్రేణి తిరుగులేని మెరుపును అందించడంతో ఈ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తుంది’’ అని అన్నారు.
ఒగ్లివీ ఇండియా చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ ప్రేమ్ నారాయణ్ మాట్లాడుతూ, ‘‘ఏషియన్ పెయింట్స్ ట్రాక్టర్ షైన్, ఏస్ షైన్ ఈ విభాగంలో తిరుగులేని ఉత్పాదనలు. వాటితో పెయింట్ చేసినప్పుడు, ఆ ప్రకాశత్వం ఇంటి యజమానులకు గర్వకారణం అవుతుంది. తాము అనుకున్న బడ్జెట్ లో ఈ పని పూర్తయితే, అది వారికి మరింత గర్వంగా ఉంటుంది. బడ్జెట్లో షైన్ అందించేందుకు ట్రాక్టర్ షైన్ (లోపలి గోడలు), ఏస్ షైన్ (వెలుపలి గోడలు) ఓ ప్రమాణంగా నిలిచాయి. తన బడ్జెట్లో ఈ బ్రాండ్లు గణనీయ మెరుపును అందించడాన్ని ఇంటి యజమాని అనుభూతి చెందడాన్ని ఈ సృజనాత్మక చిత్రం వెల్లడిస్తుంది. షైన్ అందించే మెరుపుతో మరే దాన్నీ పోల్చలేమని కూడా ఆయన అంటాడు. ఇదంతా కూడా హాస్యభరితంగా సాగుతూ ‘గ్రేట్ ఆన్ షైన్, లైట్ ఆన్ యువర్ ప్యాకెట్’’ అనే సందేశంతో ముగుస్తుంది’’ అని అన్నారు.