Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్‌పై వీఆర్ ప్రకటనల ఫార్మాట్‌ను మిళితం చేయడం వల్ల వినియోగదారులతో అనుసంధానించబడటానికి బ్రాండ్లకు నూతన మార్గాలు..
3డీ విజువల్స్ మరియు వీడియోలు ఎలాంటి ల్యాగ్ లేకుండా లైఫ్ లైక్ ఉంటాయని భరోసా అందించే లో–లాటెన్సీ 5జీ నెట్వర్క్
న్యూఢిల్లీ, అక్టోబర్ 02,2022: భారతీ ఎయిర్టెల్ (ఎయిర్టెల్) నేడు భారతదేశపు మొట్టమొదటి వర్ట్యువల్ రియాల్టీ (వీఆర్) ప్రకటనను 5జీ శక్తితో విడుదల చేసింది. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్‌పై ఈ ప్రకటన నమూనా లీనమయ్యే వాతావరణంలో వినియోగదారులతో అనుసంధానించబడానికి బ్రాండ్లకు నూతన మార్గాలు అందిస్తుంది. సంప్రదాయ ప్రకటనలలో గతంలో ఇది సాధ్యమయ్యేది కాదు.
అత్యంత వేగవంతమైన, లో లాటెన్సీ 5జీ నెట్వర్క్ 3డీ విజువల్స్‌కు భరోసా అందించడంతో పాటుగా వీడియోలు అన్నీ కూడా వాస్తవ జీవితపు చిత్రాలను ప్రదర్శిస్తాయి. ఈ ప్రకటనల నమూనాతో బ్రాండ్లు ఇప్పుడు తమ వినియోగదారులకు లీనమయ్యే రీతిలో ప్రకటనను ఎలాంటి ఆలస్యం లేకుండా అందించడంతో పాటుగా వారిని బ్రాండ్‌తో అనుసంధానిస్తుంది. భారతదేశంలో అగ్రగామి బ్రాండ్లు అయిన పెప్సికో, సోనీ లివ్ వంటి వాటితో ఎయిర్టెల్ చేతులు కలపడంతో పాటుగా ఓ నమూనా వీడియో చిత్రించింది. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ వద్ద ఈ ఉత్పత్తి యొక్క సామర్ధ్యపు ప్రదర్శన నమూనాను ప్రదర్శించింది.
నేడు, భారతీయ ప్రకటనల పరిశ్రమ వేగం పుంజుకుంది. భారతదేశపు 750మిలియన్లకు పైగా మొబైల్ వినియోగదారులు తమ మొబైల్ స్ర్కీన్లపై అత్యధిక సమయం గడుపుతున్నారు. సరాసరిన 5 గంటలు ప్రతిరోజూ ఈ స్ర్కీన్లతో ఉంటున్నారని యాప్ అన్నీ(Annie)) నివేదిక వెల్లడిస్తుంది. శ్రద్ధ పరిధిలు గణనీయంగా తగ్గుతుండటంతో బ్రాండ్లు ఇప్పుడు వినూత్నమైన మొబైల్ ఫస్ట్ యాడ్ ఫార్మాట్లను భావి తరపు ప్రేక్షకులతో అనుసంధానించబడేందుకు, వారి శ్రద్ధను ఒడిసిపట్టి, అవగాహన మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాయి.
ఎయిర్టెల్ డిజిటల్ సీఈఓ శ్రీ ఆదర్శ్ నాయర్ మాట్లాడుతూ '5జీ యొక్క అతి పెద్ద ప్రయోజనమేమిటంటే, అతి తక్కువ లాటెన్సీతో మరింత అధికంగా చేసే వీలు కల్పించడం. మేము ఈ సాంకేతికతపై ఆధారపడి భారతదేశపు మొట్టమొదటి లీనమయ్యే వీఆర్ ప్రకటనను తీర్చిదిద్దాము. ఇది బ్రాండ్లు నేరుగా తమ వినియోగదారులతో మొబైల్ ఫస్ట్ వాతావరణంలో అనుసంధానించబడే అవకాశం అందిస్తుంది. బ్రాండ్లు దీనిపై ఆధారపడి అనుసంధానిత, లీనమయ్యే, వ్యక్తిగత అనుభవాలను తమ వినియోగదారులకు అందించవచ్చు` అని అన్నారు.
మరింతగా అభ్యసించేందుకు , వారితో టచ్‌లో ఉండేందుకు https://www.airtel.in/ads// సందర్శించండి.