Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఈ రోజు విడుదల చేసింది #FindCelebration - #FindLife క్యాంపెయిన్ విడుదలకు ఇది సీక్వెల్, వేడుకలను జరుపుకునే తరుణాల వెనుక భావోద్వేగాలను, అసలైన కస్టమర్లు-అసలైన కథలు, అసలైన మనుషులు, అసలైన భావోద్వేగాల లెన్స్ ద్వారా నిక్షిప్తం చేస్తుంది. Amazon.in కస్టమర్లు సెర్చ్ చేసే సమయంలో, వారి ముఖంలోని భావాలతో, స్వయంగా వారితో కూడిన కథలను #FindLife క్యాంపెయిన్ గుదిగుచ్చి మధురానుభూతులుగా మారుస్తుంది. #FindCelebration ఫిల్మ్, అసలైన కస్టమర్ కథలోకి లోతంటా వెళ్ళి, వారి పండుగ సంబరాలను, పండుగ స్ఫూర్తిని వెలికి తీసి కట్టెదుట నిలుపుతుంది.
కొచ్చీలో ఒక కుర్రవాడు, అతనితో కలిసి అతని కుటుంబం పండుగ సంబరాలను చేసుకునే కథను #FindCelebration తెలియచెబుతోంది. కుర్రవాడు తన నాయనమ్మకు పువ్వు ఇచ్చి, ఆమెను గుండెకు హత్తుకోవటంతో మొదలైన కథ, అచప్పాలు తయారు చేయటం, మొత్తం కుటుంబం అంతా కలసి ఆనందసమయంలో తీసుకున్న సెల్ఫీ, ఇలా సాగుతుంది. కస్టమర్లు పండుగ సంబరాలను కలిసి జరుపుకునేందుకు ఉత్పత్తులు, అవి చిన్నవి కావచ్చు లేదా పెద్దవి కావచ్చు, ఎలా ఉపయోగపడతాయో కంటికి కనిపించేట్లు తెలియచేసేందుకు ఉద్దేశించినది ఈ క్యాంపెయిన్.
క్యాంపెయిన్ గురించి మాట్లాడుతూ, మనీష్ తివారి, కంట్రీ మేనేజర్ & వైస్ ప్రెసిడెంట్, ఇండియా కన్స్యూమర్ బిజినెస్ – అమెజాన్ ఇండియా ఇలా అన్నారు, “మన దేశపు సాంస్కృతిక వారసత్వాన్ని, సాంప్రదాయ విలువలను మేము సవినయంగా హత్తుకున్నాము. మన దైనందిన జీవితాల్లోని ఈ విలువలకు సజీవరూపం ఈ క్యాంపెయిన్. మేము డెలివర్ చేసే ప్రతి ఆర్డర్, మా విక్రేతలు, కస్టమర్ల జీవితాలను మెరుగుపరిచే దిశలో, వారికి ఆనందాన్ని కలిగించే దిశలో ఒక ముందడుగు. మా కస్టమర్ల జీవితాల్లో పండుగ సమయాల్లో విలువలను జోడించాలని Amazon.in ఏ విధంగా లక్ష్యంగా పెట్టుకున్నదో ప్రత్యేకంగా తెలియచేసి #FindCelebration ఆ సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తుంది.”
వేడుకలు, సంబరాలు దూరాలను దాటుకుని, మనుషులను వారి కుటుంబాలతో, వారు అభిమానించే వ్యక్తులతో ఏకం చేస్తాయి. Amazon.in, ఈ కొత్త డిజిటల్ వీడియా ద్వారా, ఒక పిల్లవాడు ఈ పండుగ సీజన్‌ను కొచ్చీలోని తన తాతయ్య-నాయనమ్మలతో ఎలా గడిపాడో చూపటానికి ప్రయత్నించింది. Amazon.in పై 65% కస్టమర్ ఆర్డర్లు, 85% పైగా కొత్త కస్టమర్లు 2వ శ్రేణి మరియు దిగువ భౌగోళిక ప్రాంతాలకు చెందినవారు కావటం, భారతదేశంలో సర్వీస్ అందించగలగిన పిన్కోడ్లలో దాదాపుగా 100 శాతం మంది కస్టమర్లు Amazon.in పై షాపింగ్ చేస్తున్నారు.
రే పేజ్, EVP, హెడ్ ఆఫ్ గ్లోబల్ ఇనొవేషన్ అండ్ సోషల్ ఇంపాక్ట్ – WE కమ్యూనికేషన్స్ ఇలా అన్నారు, “అసలైన వ్యక్తులు, అసలైన కుటుంబాలతో (నటులతో కాదు) వారి జీవితాల్లోకి, వారి బంధుత్వాలు, బంధాలలోకి తొంగి చూడగలిగేందుకు కలిసి పనిచేయటం మాకు గర్వకారణం. ప్రజల జీవితాల్లోని “కనుగొనుట”అనే అంశాన్ని ప్రత్యేకంగా వెలుగులోకి తెచ్చి చూపటం ద్వారా ఈ క్యాంపెయిన్ యొక్క విలక్షణమైన లోతైన కథాంశాలను చూపాలన్నది మా లక్ష్యం. ఈ క్యాంపెయిన్‌లో మేము ప్రత్యేకంగా పండుగ వేడుకలు, కుటుంబాలు ఎలా కలుసుకుని సంబరాలు చేసుకుంటాయనే విషయం మీద దృష్టిని సారించాము. ఈ #FindCelebration ఫిల్మ్, బంధానికి జరిపిన వేడుక!”
ఈ క్యాంపెయిన్‌ను డ్రోన్ ఉపయోగించి మరియు చేతితో పట్టుకున్న కెమేరాలను ఉపయోగించి షూట్ చేయటం జరిగింది. తద్వారా అందుబాటులోకి వచ్చే పరిమాణాన్ని చూపుతూనే, సామీప్యతను కూడా మెయింటెయిన్ చేయటమైనది. అందువలన కనిపించే దృశ్యం యాక్షన్‌లో ఉండటం జరుగుతుంది. #FindLife, ఆరువారాలపాటు జరిగే డిజిటల్ క్యాంపెయిన్. ఇది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 ముగిసే వరకు ఇది కొనసాగుతుంది.