Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలో వినియోగదారులకు రుణాలను అందించే అతి పెద్ద యాప్ ఎర్లీస్యాలరీ ఇప్పుడు Fibeగా మారింది. అడ్డంకులు లేని మరియు అందుబాటు ధరలో పరిష్కారాలను అందతించే కెంపెనీ లక్ష్యానికి అనుగుణంగా కొత్త పేరు ఉండగా, భారతీయ యువ ఆకాంక్షులకు ఉత్తేజకరమైన ఆర్థిక వ్యవస్థగా నిలవడానికి ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ రీ బ్రాండింగ్‌లో భాగంగా కంపెనీ కొత్త వెబ్సైట్ (https://www.fibe.in )కు మారగా, తన యాప్‌లో అప్డేట్ అయిన ఎడిషన్‌ను విడుదల చేసింది మరియు తన కొత్త లాంఛనానిన కూడా ఆవిష్కరించింది. కంపెనీ 2016లో తన సేవలను ప్రారంభించగా, యువ భారతీయులకు తేలికగా రుణాన్ని అందించేందుకు, ముఖ్యంగా వేతనాలు అందుకుంటున్న ఉద్యోగులకు రుణాలను అందించే లక్ష్యాన్ని సంస్థ కలిగి ఉంది. పలు సంవత్సరాల నుంచి కంపెనీ 3-24 నెలల అల్పావధి నగదు రుణాలు, దీర్ఘావధి వ్యక్తిగత రుణాల శ్రేణి పొడక్ట్స్ను సృష్టించింద. గత 18 నెలల్లో ఈ బ్రాండ్ సరికొత్త బై నౌ పే లేటర్ (BNPL) సౌకర్యాలను ఎడ్టెక్, హెల్త్‌టెక్, షాపిం మరియు లైఫ్ స్టైల్ వలయాలకు అందించడం ద్వారా అందుబాటు ధరల విభాగానికి అడుగు పెట్టింది. దీని ఫలితంగా కంపెనీ ఉద్దేశిత వినియోగదారులు ఎక్కువ విస్తృత వినియోగదారుల వలయానికి చేరుకునే అవకాశం కలిగింది.
కంపెనీ తన పరిధిని 18 నగరాల నుంచి 150 నగరాలకు విస్తరించింది. కొత్త వినియోగదారుల సంఖ్యను నెలకు 35,000 నుంచి ప్రతి నెలకు 1 లక్షకు పెంచుకుంది. కంపెనీ తన సేవలను ఎక్కువ ప్రాంతాలకు విస్తృత శ్రేణి ఉత్పత్తులను వినియోగదారులకు అందించే లక్ష్యాన్ని కలిగి ఉంది.
‘ఫైనాన్స్+ వైబ్’ సమ్మేళనమే Fibe కాగా, అది అడ్డకుంలు లేని ఆర్థిక అనుభవాన్ని అందించే బ్రాండ్ ప్రయత్నాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పేరు మార్పుతో తన వాణిజ్య నమూనా ఉన్నతశ్రేణి వినియోగదారులను మరింత ఏకీకరిస్తుందని కంపెనీ విశ్వసిస్తోంది.
Fibe (గతంలో ఎర్లీస్యాలరీ) తన అస్తిత్వాన్ని రానున్న 5 ఏళ్లలో .5 బిలియన్ డాలర్లను అధిగమించి AUM (నిర్వహణలోని సంపద) తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే లక్ష్యాన్ని కలిగి ఉంది. ఇది 0 మిలియన్ డాలర్ సిరీస్ డి ఫండింగ్‌ను కూడా అందుకోగా, దానికి ఆగస్టులో టిపిజిలో ది రైజ్ ఫండ్ నార్వెస్ట్ వెంచర్ పార్ట్నర్స్ నేతృత్వం వహించాయి.
విస్తరించిన ప్రగతి ధ్యేయోద్దేశాలకు అనుగుణంగా Fibe (గతంలో ఎర్లీస్యాలరీ) తన ఉత్పత్తులకు ఎక్కువ పరిధిని కల్పించేందుకు పలు వర్టికల్స్‌కు కార్యాచరణలను విస్తరించే లక్ష్యాన్ని కలిగి ఉంది. ఇది బిఎన్పిఎల్ భాగస్వాముల పెద్ద నెట్వర్కును నిర్మించే లక్ష్యాన్ని కలిగి ఉంది. ఇది తన పరిధిని టైయర్ 3 మరియు టైయర్ 4 నగరాలకు విస్తరించే ఉద్దేశాన్ని కలిగి ఉంది.
రీ బ్రాండింగ్ గురించి Fibe సహ-వ్యవస్థాపకుడు మరియు సీఈఓ అక్షయ్ మెహ్రోత్రా మాట్లాడుతూ, ‘‘ఎర్లీస్యాలరీ పేరిట వేతనాలను అడ్వాన్సుగా ఇచ్చే వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు బ్రాండ్ పేరుకు తగినట్లే చాలా చక్కగా పని చేసింది. పలు సంవత్సరాల నుంచి మేము తక్షణ నగదు రుణాలే కాకుండా బిఎన్పిఎల్ సదుపాయాలను ఎడ్టెక్, ఆరోగ్య సేవలు మరియు కన్సూమర్ టెక్ విభాగాల్లో అందుబాటులోకి తీసుకు వచ్చాము. అంతే కాకుండా మేము ఎక్కువ మంది వినియోగదారులకు సేవలను అందించేలా అభివృద్ధిని సాధించాము. దీనితో బ్రాండ్ పొజిషనింగ్‌లో మార్పు అత్యవసరం అయింది’’ అని పేర్కొన్నారు. దీని గురించి మరింత వివరిస్తూ Fibe మల్టీ-వర్టికల్ వినియోగదారులను తన వలయానికి చేర్చుకునేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. కొత్త బ్రాండింగ్ సాంకేతికత మద్దతుతో అందుబాటును కల్పిస్తోంది. దానితో ఆర్థిక సేవలను అందుకునేందుకు చికాకు, ఇబ్బంది రహిత అనుభవాన్ని సృష్టిస్తుంది. దాని కోసమే మేము కొత్త వెబ్సైట్ Fibe.in సృష్టించాము’’ అని వివరించారు.
Fibe సహ-వ్యవస్థాపకుడు సిఎఫ్ఓ ఆశిశ్ గోయల్ మాట్లాడుతూ, ‘‘ఈ రీబ్రాండింగ్ మా సేవలు మరియు వినియోగదారుల వలయాన్ని మరింత వృద్ధి చేసే లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఎర్లీ స్యాలరీ బ్రాండ్ పేరిట మా వినియోగదారుల మనస్సులో చక్కని స్థానాన్ని దక్కించుకున్నాము మరియు Fibe దానినే కొనసాగిస్తుంది. కొత్త పేరు సకారాత్మక వైబ్‌ను సృష్టించే సేవలను అందించే మా సిద్ధాంతాలను సరైన రీతిలో వివరిస్తుంది’’ అని పేర్కొన్నారు.
Fibe గురించి
Fibe (గతంలో ఎర్లీస్యాలరీ) వినియోగదారులకు రుణాలను అందించే అగ్రగామి యాప్‌లలో ఒకటిగా, యవతకు, ఉద్యోగులకు మరియు సాంకేతికత-వినియోగించే భారతీయ వినియోగదారులకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇది మిడ్ సైజ్ ఆదాయాన్ని కలిగిన వర్గానికి వారి ఆకాంక్షలను నెరవేర్చుకునే ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తోంది. ఇది అత్యంత వేగవంతమైన ప్రాసెసింగ్ సమయం ద్వారా వేతన అడ్వాన్స్ వలయంలో నాయకునిగా ఎదిగింది. ఇది నగదు రుణాలు, దీర్ఘావధి పర్సనల్ రుణాలు మరియు బై నౌ పే లేటర్ ప్లాన్లతో ఆర్థిక ఉత్పత్తులను విడుదల చేసింది. ఇది 100% మేర డిజిటల్ రుణ అర్జీ ప్రక్రియను అందిస్తుండగా, కొన్ని క్షణాల్లోనే రుణాన్ని విడుదల చేస్తుంది. కొన్ని సంవత్సరాలలోనే Fibe పలు రెట్లు వృద్ధి చెందింది మరియు భారతదేశంలో యువ మధ్య –శ్రేణిలో వేతనాలను అందుకునే వారికి ఆర్థిక మద్దతు ఇవ్వడంలో మార్కెట్లో నాయకునిగా ఎదిగింది. కంపెనీ ఇప్పటికే బిలియన్ డాలర్ల విలువైన 2.8 మిలియన్ రుణాలను వితరణ చేసింది.