Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గౌవిట్ ఆక్వా పేరుతో లాంచింగ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
జంతు, మానవ వ్యాక్సిన్లలో మార్కెట్ లీడర్‌గా ఉన్న ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) సంస్థ ఆక్వా కల్చర్ హెల్త్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్టు ప్రకటించింది. దేశంలో రొయ్యలు, చేపల ఉత్పత్తి అవసరాలను తీర్చడానికి ఈ విభాగంలోకి గౌవిట్ ఆక్వా పేరుతో వస్తున్నామని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన బిజినెస్ లాంచ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆక్వా హెల్త్ ఇండిస్టీలో యాంటీబయాటిక్స్ వాడకాన్ని గణనీయంగా తగ్గించే వ్యాక్సిన్ ఉత్పత్తులను ప్రవేశపెడతామన్నారు. ఐఐఎల్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రియబ్రత పట్నాయక్ మాట్లాడుతూ ఈ వ్యాక్సిన్ల తయారీకి అవసరమైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బృందం తమవద్ద అన్ని సాంకేతిక సామర్థ్యాలతో సిద్ధంగా ఉందన్నారు. ఈ రంగంలో వ్యాక్సిన్ల ప్రవేశం బహుళ దశల్లో ఉంటుందని వివరించారు. తమ సంస్థ ఇప్పటికే మానవులు, పశువులు, మేకలు, పందులు తదితర సహచర జంతువుల కోసం అనేక రకాల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నదని తెలిపారు.