Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమ స్ధిరమైన వినూత్న విధానం ద్వారా అత్యుత్తమ నొప్పి ఉపశమన బ్రాండ్ గా మారాలనే తమ లక్ష్యం బలోపేతం చేసుకుంటుంది
న్యూఢిల్లీ, అక్టోబర్ 2022: హాలియన్కు చెందిన సుప్రసిద్ధ బాడీ పెయిన్ ఎక్స్పర్ట్, భారతదేశంలో 100 సంవత్సరాలుగా ప్రతి ఇంటికీ సుపరిచితమైన అయోడెక్స్ తమ నూతన వేరియంట్ అయోడెక్స్ పవర్ జెల్‌ను విడుదల చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ నూతన ఉత్పత్తి ఆయుర్వేద సూత్రాలతో తీర్చిదిద్దబడింది. దీనిలో నాలుగు శక్తివంతమైన నొప్పి నివారిణిలు ఉన్నాయి.
ఈ శక్తివంతమైన ఫార్ములేషన్‌లో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అయిన : బోస్వెల్లియా, కాప్సికమ్ ఎక్స్ట్రాక్ట్, పెప్పర్మింట్ సత్వ, గింధ్పుర తైల ఉన్నాయి. ఈ నూతన ఫార్ములాలోని యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ (క్రియాశీల పదార్ధాలు)చర్మం లోపలకు చొచ్చుకుపోవడంతో పాటుగా అంతర్గత వాపులను సైతం తగ్గించి, విభిన్నమైన శరీర నొప్పులు అయిన నడుం నొప్పి, కీళ్లనొప్పులు, మెడ నొప్పి, భుజం నొప్పి, ఒత్తిడి, బెణుకు, స్పాసమ్స్ నుంచి ఉపశమనం అందిస్తుంది.
సుప్రసిద్ధ నొప్పి నివారణ బ్రాండ్‌గా, అయోడెక్స్ తమ ఉత్పత్తి శ్రేణిని మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి సమూలంగా మార్చడంతో పాటుగా శతాబ్ద కాలంగా ప్రతి ఇంటిలోనూ అత్యంత నమ్మకమైన పేరుగా లక్షలాది మంది వినియోగదారుల నడుమ నిలిచింది. శాస్త్ర విజ్ఞాన తోడ్పాటుతో ఈ బ్రాండ్ ఇప్పుడు విస్తృత శ్రేణి పోర్ట్‌ఫోలియోను నొప్పి నివారణ ఉత్పత్తులు అయిన అయోడెక్స్ బామ్, అయోడెక్స్ ర్యాపిడ్ యాక్షన్ స్ర్పే, అయోడెక్స్ అల్ట్రా జెల్, అయోడెక్స్ పవర్ జెల్‌ను కలిగి ఉంది. వీటిని విభిన్నమైన నొప్పులకు ఉపయోగించడంతో పాటుగా వినియోగదారుల విభిన్న ప్రాధాన్యతా అవసరాలను తీర్చే రీతిలో రూపొందించారు.
ఈ సందర్భంగా హాలియన్ హెడ్ ఆఫ్ మార్కెటింగ్ – ఇండియా సబ్‌కాంటినెంట్ అనురిత చోప్రా మాట్లాడుతూ 'మారిన జీవనశైలి, అసలు ఖాళీ లేని షెడ్యూల్స్ కారణంగా వ్యక్తులలో శరీర నొప్పులు కూడా పెరుగుతున్నాయి. వినియోగదారులు స్ధిరమైన తమ నొప్పి నివారణ పరిష్కారాలను ఆధునీకరించడం కోసం నిరంతరం అవకాశాలను వెదుకుతున్నారు. దీనిలో భాగంగా ఆధునిక రూపాలైనటువంటి జెల్స్‌ను వేగవంతమైన యాక్షన్ కోసం వినియోగించడం, అతి సులభంగా రాసుకునే అవకాశం, అత్యుత్తమ స్పర్శ అనుభవాలు కోరుకుంటున్నారు. అయోడెక్స్ పవర్ జెల్ ఆవిష్కరణతో , వివేక వంతులైన వినియోగదారుల అవసరాలను తీరుస్తున్నాము. వీరు సహజసిద్ధమైన పదార్ధాలతో కూడిన పరిష్కారాలను కోరుకుంటున్నారు. అయోడెక్స్ పోర్ట్‌ఫోలియోకు అయోడెక్స్ పవర్ జెల్ జోడించడం ద్వారా వినియోగదారులతో మా బంధం మరింతగా బలోపేతం చేసుకోవడాన్ని లక్ష్యంగా చేసుకున్నాము` అని అన్నారు
భారతదేశంలో సుప్రసిద్ధ పెయిన్ రిలీవర్స్లో ఒకటి అయోడెక్స్. భారతదేశ వ్యాప్తంగా ఆన్లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ ఫార్మాట్లలో లభిస్తుంది. ఈ నూతన వేరియంట్‌ను రెండు ప్యాక్‌లు – 10 గ్రాములు 50రూపాయలు మరియు 30 గ్రాములు – 130 రూపాయల ధరలో భారతదేశ వ్యాప్తంగా అన్ని సుప్రసిద్ధ స్టోర్లలో లభ్యమవుతుంది.