Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దాన్ ఉత్సవ్ తో కలిసి నెలంతా ‘ఫియస్టా ఆఫ్ షేరింగ్’ ప్రారంభం
హైదరాబాద్, 07 అక్టోబర్, 2022: బార్బెక్యూ నేషన్, 'దాన్ ఉత్సవ్` తో అనుబంధంలో భాగంగా 'బిగ్ అపెటైట్, బిగ్గర్ హార్ట్స్` ప్రచారాన్ని ప్రారంభించినట్టు శుక్రవారం ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా బార్బెక్యూ నేషన్ భారతదేశం, యూఏఈ, మలేషియా మరియు ఒమన్‌లోని అన్ని రెస్టారెంట్లలో 40,000 మంది నిరుపేద చిన్నారులకు భోజనం అందిస్తుంది. వచ్చే నెలలో, బార్బెక్యూ నేషన్‌లోని 200 రెస్టారెంట్లలో ప్రతీ రెస్టారెంట్ 200 పిల్లలకు భోజనాలను అందిస్తాయి. దీని కోసం బార్బెక్యూ నేషన్ భారతదేశం మరియు విదేశాలలో వివిధ ఎన్జిఓలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాలంలో బార్బెక్యూ నేషన్‌లో భోజనం చేసే అతిథులు కూడా తమ ఈ పిల్లలకు తమ సహకారాన్ని అందించడానికి, ఈ ప్రచారంలో ద్వారా స్వాగతం పలుకుతారు.
ఈ సందర్భంగా, బార్బెక్యూ నేషన్ హాస్పిటాలిటీ లిమిటెడ్ సీఈఓ, రాహుల్ అగర్వాల్ మాట్లాడుతూ.. 'నిదాన్ ఉత్సవ్ తో కలిసి పనిచేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. 'బిగ్ అపెటైట్, బిగ్గర్ హార్ట్స్` క్యాంపెయిన్ అనేది మా రెస్టారెంట్ల నెట్‌వర్క్‌లో ఒక నెల పాటు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం నవంబర్ నాటికి 200 రెస్టారెంట్లలో పూర్తవుతుందని భావిస్తున్నాను. ఈ ప్రచారం ద్వారా, మేము 2006 నుండి మా అతిధుల నుండి పొందిన ప్రేమ మరియు మద్దతును పేద చిన్నారులకు సేవ చేయడం ద్వారా సమాజానికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నాము. బార్బెక్యూ నేషన్‌ను సందర్శించే అతిథులు కూడా ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములై ఈ మెగా దాతృత్వ ప్రచారంలో చేతులు కలుపుతారని మేము విశ్వసిస్తున్నాము.
దాన్ ఉత్సవ్ వాలంటీర్ అయిన సుజిత్ మహాపార్ త్రా మాట్లాడుతూ 'ఆహారం ఇవ్వడం అనేది దానం చేయడానికి సరైన మార్గం, అన్ని దానాల్లోకెల్లా అన్న దానం చాలా గొప్పది . బార్బెక్యూ నేషన్ 200 రెస్టారెంట్ల మైలురాయిని దాటేందుకు చూస్తున్నందున మేము వారి దయా గుణానికి సంతోషిస్తున్నాము. ఇంత మొత్తంలో ఇటువంటి అనుభవం పిల్లలకు చాలా అరుదుగా అందించబడుతుంది. ఆహారాన్ని అందించడం ద్వారా తమ సేవను వ్యాప్తి చేయాలనే ఈ ఆలోచన బార్బెక్యూ నేషన్ యొక్క గొప్ప దాతృత్వ చర్య` అని అన్నారు.