Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : వరుసగా రెండో సెషన్లోనూ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు చవి చూశాయి. సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్ ఓ దశలో 760 పాయింట్లు కుప్పకూలి.. 57,366 కనిష్ట స్థాయికి దిగజారింది. తుదకు 200 పాయింట్ల నష్టంతో 57,991కి పడిపోయింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 74 పాయింట్లు తగ్గి 17,241 వద్ద ముగిసింది. సెన్సెక్స్-30లో యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్‌లు రాణించగా.. మారుతి సుజుకి, టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్ తదితర స్టాక్స్ స్వల్ప లాభాలను నమోదు చేశాయి. మరోవైపు ఏసియన్ పెయింట్స్, టైటన్, ఐటీసీ, రిలయన్స్ ఇండిస్టీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సూచీలు అధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.