Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూ2లో రూ.10,431 కోట్ల లాభాలు
ముంబయి: దేశంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నిపుణుల అంచనాలు మించి మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 8.4 శాతం వృద్థితో రూ.10,431 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.9,624 కోట్ల లాభాలు నమోదు చేసింది. కాగా.. ఈ కంపెనీ 2022 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.10,244 కోట్ల లాభాలు ఆర్జించే అవకాశాలున్నాయని రాయిటర్స్ తొలుత అంచనా వేసింది. గడిచిన క్యూ2లో కంపెనీ రెవెన్యూ 18 శాతం పెరిగి రూ.54,309 కోట్లకు చేరింది. ఈ త్రైమాసికంలో కొత్తగా 9,840 మంది ఉద్యోగులను తీసుకోవడం ద్వారా ఆ కంపెనీలో మొత్తం మానవ వనరుల సంఖ్య 6.16 లక్షలకు చేరింది.