Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: ఐఐటీ మద్రాస్ వారి టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్, ఐఐటీ మద్రాస్ ప్రవర్తక్ ఫౌండేషన్, విద్యార్థులు బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ లో కెరీర్ రూపొందించడానికి పరిశ్రమ సంబంధిత నైపుణ్యాల కోర్స్‌లను అందిస్తోంది. చెన్నై లో ప్రీమియర్ ఫైనాన్స్ సెక్టర్ సర్టిఫైడ్ ట్రైనర్ ఇన్ఫాక్ట్ప్రోతో, ఐఐటీ మద్రాస్ వారి చొరవ డిజిటల్ స్కిల్స్ అకాడమీ సహకారం తో కోర్సులు అందించబడుతున్నాయి. ఇన్ఫాక్ట్ప్రో బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు స్కిల్స్ డెవెలప్మెంట్ మంత్రిత్వ శాఖ యొక్క ఇన్స్యూరెన్స్ సెక్టర్ స్కిల్ కౌన్సిల్ యొక్క శిక్షణా భాగస్వామి.
బ్యాంకింగ్ లో కెరీర్ రూపొందించడానికి భారతదేశంలో విద్యార్థులలో ఎంతో ఆసక్తి ఉంది. దాదాపు 30 లక్షల మంది ఆశావహులు ఏటా వివిధ బ్యాంక్ నియామక పరీక్షలు రాస్తున్నారు, వారిలో కేవలం 0.5 శాతం మాత్రమే పరీక్షలో ఉత్తీర్ణమవుతున్నారు. ఈ విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగు పరచుకోవడానికి సిద్ధంగా ఉంటే ఫైనాన్స్ మరియు బ్యాంకింగ్ రంగాలలో వారి కోసం భారీ అవకాశాలు ఉన్నాయి. టియర్ 2 మరియు టియర్ 3 పట్టణాలలో బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ కోసం డిమాండ్ పెరుగుతుండటంతో సహజాంగానే ఈ పట్టణాలలో శిక్షణా ప్రొఫెషనల్స్ కోసం డిమాండ్ పెరుగుతోంది. ఇంకా కోర్సులో పేరు నమోదు చేసుకోవడం మరియు పాఠ్యాంశాలు గురించి వివరాలను ఈ క్రింది వెబ్‌సైట్స్ https://iit.infactpro.com లేదా https://skillsacademy.iitm.ac.in నుండి పొందవచ్చు.
కోర్స్‌లను అందిస్తున్నందుకు టీమ్ కు అభినందనలు తెలుపుతూ, ప్రొఫెసర్ వి కామకోటి, డైరక్టర్, ఐఐటీ మద్రాస్ మరియు ఛైర్మన్, ఐఐటీ మద్రాస్ ప్రవర్తక్ ఫౌండేషన్ ఇలా అన్నారు, "విద్య అనేది ఒక నిరంతర ప్రక్రియ, పనిలో పోటీయుతంగా ఉండటానికి విద్యార్థులు మరియు ప్రొఫెషనల్స్ నిరంతరంగా తమ విజ్ఞానం మరియు నైపుణ్యాలను పెంచుకోవాలి. సాధన అనేది జీవితకాలం ప్రక్రియ. ఈ కోర్స్ లో దేశవ్యాప్తంగా ఉన్న సాధకులు అందరి వద్దకు ప్రత్యేకించి, డిజిటల్ అక్షరాస్యత అతి తక్కువగా లభించే భారతదేశంలోని సుదూర ప్రాంతాలకు చేరుతాయి మరియు తాము ఎంచుకున్న కెరీర్ ప్రయాణాలలో అభివృద్ధి చెందటంలో ప్రతి ఒక్కరికి సహాయ పడతాయి. ఇంకా, ప్రొఫెసర్ కామకోటి ఇలా అన్నారు, "మన దేశం అతి వేగంగా 5-ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ వైపుగా పయనిస్తున్న నేపధ్యంలో, ప్రీమియర్ సంస్థలు మరియు పరిశ్రమ ఉమ్మడిగా అందించే అలాంటి నైపుణ్యాభివృద్ధి కోర్సులు బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ లో కెరీర్ రూపొందించుకోవాలని కోరుకుంటున్న విద్యార్థులకు సహాయ పడటం ప్రధానం."
బ్యాచిలర్స్ డిగ్రీని అనుసరించే సాధకులు అందరూ లేదా బ్యాచిలర్స్ డిగ్రీని ఏదైనా విభాగంలో పూర్తి చేసిన వారు మరియు బీఎఫ్ఎస్ఐ డొమైన్ లో శ్రేష్టత సంపాదించాలని అభిరుచి కలిగినవారు ఈ సర్టిఫికేషన్ కోర్స్‌లు తీసుకోవడానికి అర్హులు. ఈ సర్టిఫికేషన్ కోర్స్‌లు తీసుకున్న విద్యార్థులు ఎన్ఐఎస్ఎం, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ మరియు ఐఐబీఎఫ్లు నిర్వహించే వివిధ సర్టిఫికేషన్ పరీక్షలు రాయవచ్చు. ఈ కోర్సులు గురించి వివరిస్తూ, డిజిటల్ స్కిల్స్ అకాడమీ, సెంటర్ ఫర్ అవుట్‌రీచ్ మరియు డిజిటల్ ఎడ్యుకేషన్ (సీఓడీఈ), ఐఐటీ మద్రాస్, ప్రొఫెసర్ కే మంగళ సుందర్, ప్రిన్సిపల్ కోఆర్డినేటర్ ఇలా అన్నారు, "ఇటీవల టెక్నాలజీ పురోగతితో మరియు బీఎఫ్ఎస్ఐ రంగంలో డిజిటల్ అనుసరణతో, సరైన నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులు కోసం రిక్రూటర్స్ అన్వేషిస్తున్నారు. బీఎఫ్ఎస్ఐ డొమైన్ నైపుణ్యం రూపొందించడానికి కాలేజీలు నుండి విద్యార్థులు గ్రాడ్యుయేట్ చేయడం ప్రధానం. ఈ సర్టిఫికేషన్ కోర్స్‌లు బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ డెరివేటివ్స్, డిజిటల్ బ్యాంకింగ్, సెక్యూరిటీస్ ఆపరేషన్స్ మరియు రిస్క్ మేనేజ్మెంట్ యొక్క సూత్రాలను లోతుగా అర్థం చేసుకోవడాన్ని కేటాయిస్తాయి. ఐఐటీ మద్రాస్ డిజిటల్ స్కిల్స్ అకాడమీ ఐఐటీఎం ప్రవర్తక్ లో చేరింది పరిశ్రమ సంబంధిత నైపుణ్యాలను అందచేసి మరియు బీఎఫ్ఎస్ఐ రంగం కోసం నియామకం చేయదగిన ఆడ, మగవారిని అందించే లక్ష్యాన్ని కలిగి ఉంది."
ఈ కోర్స్‌లను పరిశ్రమలో మరియు అకాడమియాలో అత్యంత అనుభవజ్ఞులైన బోధనా సిబ్బందిలో కొంత మంది బోధిస్తారు. ప్రొఫెసర్ ఎం. థెన్మోజి, మేనేజ్మెంట్ కోర్స్ ల విభాగం ప్రధాన అధికారి, ఐఐటీ మద్రాస్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎస్ఈబీఐ) స్థాపించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ యొక్క మాజీ డైరక్టర్, 'ప్రీమియర్ బ్యాంకర్' పై కోర్స్ కోసం ప్రధానమైన బోధనా సభ్యునిగా ఉన్నారు. ప్రముఖ బ్యాంక్స్ లో రెండు దశాబ్దాల అనుభవంతో, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ మాజీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బాలాజీ అయ్యర్ వివిధ కోర్స్‌లు కోసం బోధనా సిబ్బందిలో సహ-నాయకునిగా సేవలు అందిస్తారు. ఎన్ఏఎస్ఎస్సీఓఎం ఐటీ-ఐటీఈఎస్ సెక్టర్ స్కిల్స్ కౌన్సిల్ యొక్క ఉత్తమమైన మార్గదర్శకత్వంతో 2018 నుండి 25 కోర్సులకు పైగా ఆన్లైన్ శిక్షణా ప్రోగ్రామ్స్ ను ఐఐటీ మద్రాస్ డిజిటల్ స్కిల్స్ అకాడమీ (డీఎస్ఏ) అందిస్తోంది. కోగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ యొక్క ఫౌండర్-సీఈఓ డీఎస్ఏ కు శ్రీ. లక్ష్మీ నారాయణ్, ఐఐటీ మద్రాస్ మాజీ డైరక్టర్ ప్రొఫెసర్ మరియు ఎన్పీటీఈఎల్ ద్వారా భారతదేశంలో డిజిటల్ ఆన్లైన్ లెర్నింగ్ స్థాపకులు ఎం. ఎస్. అనంత్ అధ్యక్షత వహించారు. ఇది కోడ్, ఐఐటీ మద్రాస్ ద్వారా నిర్వహించబడుతోంది.