Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దివ్యాంగుల సాధికారత శాఖ, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖతో కలిసి దివ్యాంగులైన యువతకు మద్దతుగా నిలిచే లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై అమెజాన్ ఇండియా సంతకం చేసింది. ఈ ఒప్పందం మార్చి 2024 వరకు విస్తరిస్తుండగా, దేశ వ్యాప్తంగా లక్షలాది మంది పిడబ్ల్యూడీలకు ఉద్యోగ మేళాల ద్వారా కౌశల్యం మరియు ఉద్యోగ అవకాశాలను ఇచ్చే లక్ష్యాన్ని కలిగి ఉంది. డిఇపిడబ్ల్యూడి, ఎస్సిపిడబ్ల్యూడి మరియు అమెజాన్ ఈ మూడు సంస్థల మధ్యలో చేసుకున్న ఒప్పందాలతో కౌశల్యాలను అందించడం, సర్టిఫికేషన్, వ్యాపారదక్షతకు ప్రాధాన్యత ఇస్తుండగా, సమాజంలోని ప్రధాన స్రవంతికి పిడబ్ల్యూడీలు వచ్చేలా ప్రత్యేకంగా వారిని తయారు చేసే, స్థానికీకరించే పిఎంఓ అందరికీ కలుపుకుని, వారి కాళ్లపై వారు నిలబడేలా ఆత్మనిర్భర భారతదేశ నిర్మాణానికి అనుగుణమైన ధ్యేయోద్దేశాలకు అనుగుణంగా ఉంది.
ఈ కార్యక్రమం ద్వారా దివ్యాంగులులకు కావలసిన మద్దతు, శిక్షణ మరియు అవసరానికి తగిన జోక్యం చేసుకోవడం ద్వారా అంగీకారం మరియు ఇన్‌క్లూజన్ పర్యావరణాన్ని సృష్టించి, వారికి అనుభవాన్ని మెరుగుపరుచుకునే కౌశల్యాన్ని అమెజాన్ అందిస్తుంది. మంత్రిత్వ శాఖ సహకారంతో అమెజాన్ జాతీయ స్థాయిలో తన మౌలిక వనరుల కేంద్రాల ద్వారా కావలసిన సహకారాన్ని అందిస్తుంది. సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ కేంద్ర మంత్రి డా.వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ, ‘‘ఈ కార్యక్రమం దివ్యాంగులకు ఉజ్వలమైన భవిష్యత్తును సృష్టించేందుకు, వారిని ఆయా ఉద్యోగాలకు సిద్ధం చేసేందుకు మద్దతు ఇస్తుంది. ప్రైవేటు వలయం చూపిస్తున్న సానుభూతి మరియు ఉపాధి అవకాశాలకు మద్దతు ఇచ్చే కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఎక్కువ ఉద్యోగాలు మరియు వ్యాపారదక్షత అవకాశాలను సృష్టిస్తోంది. పిడబ్ల్యూడీల సామాజిక మరియు ఆర్థిక సాధికారత అనేది ప్రధాన మంత్రి స్వావలంబి భారతదేశ ధ్యేయోద్దేశాలకు చేరుకునే సాధనలో అత్యంత ప్రముఖంగా ఉంది. ఎక్కువ ఇన్‌క్లూజన్ కలిగిన వర్కుఫోర్స్‌ను నిర్మించడంలో అమెజాన్ ఇండియా చేపడుతున్న కార్యక్రమాలను స్వాగతిస్తున్నాను’’ అని తెలిపారు.
అమెజాన్‌లో కస్టమర్ ఫుల్ఫిల్మెంట్-ఎపిఎసి, ఎంఇఎన్ఎ, ఎల్ఎటిఎఎం మరియు డబ్ల్యూడబ్ల్యూ కస్టమర్ సర్వీసెస్ ఉపాధ్యక్షుడు అఖిల్ సక్సేనా మాట్లాడుతూ, ‘‘అమెజాన్ ఇండియాలో మేము ప్రగతికి అనుగుణమైన సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాము మరియు ప్రజలకు వారి పూర్తి సామర్థ్యాన్ని ఆవిష్కరించుకునేందుకు సమానమైన అవకాశాలను అందిస్తున్నాము. భారతదేశంలోని దివ్యాంగులు ఉద్యోగాలను దక్కించుకునేందుకు కావలసిన కౌశల్యాలను పెంపొందించుకునేందుకు అలాగే అర్థవంతమైన ఉద్యోగాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు పలు సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ పథకం ద్వారా అటువంటి దివ్యాంగులు 12 నుంచి 24 నెలల అవధిలో కౌశల్యాభివృద్ధి మరియు జీవనోపాధి-కేంద్రిత సాధికారతను అందుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇది మా ప్రస్తత కార్యక్రమాలకు అనుగుణమైనది కాగా, తక్కువ ప్రాతినిధ్యం కలిగిన వర్గాలకు ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది’’ అని తెలిపారు.
అదనంగా, కంపెనీ రూ.25 మిలియన్ ప్రత్యేక నిధితో సార్థక్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఇది అత్యాధునిక సాంకేతికత ద్వారా ఉపాధి పొందగల యువ పిడబ్ల్యుడిలలో గ్లోబల్ రిసోర్స్ సెంటర్ ద్వారా నైపుణ్య అంతరాలను తగ్గించే లక్ష్యాన్ని కలిగి ఉంది. ఈ నిధిని ప్రధాన స్రవంతిలోని వైకల్యాన్ని నివరించేందుకు సార్థక్ గ్లోబల్ రిసోర్స్ సెంటర్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ ఒకేషనల్ ట్రైనింగ్‌కు వినియోగించనున్నారు. ఈ కార్యక్రమం ప్రత్యేక జాబ్ పోర్టల్ యాప్ ద్వారా వేలాది దివ్యాంగులకు ఉపాధి కోసం పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. జాబ్ పోర్టల్ ద్వారా నిర్వహణ ఖర్చులకు మద్దతు ఇవ్వడం, అమెజాన్ ఇ-కామర్స్‌లో నైపుణ్యం కోసం ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్ శిక్షణా మాడ్యూళ్లను అభివృద్ధి చేసేందుకు నాలెడ్జ్ పార్టనర్‌గా కూడా ఉంటుంది. అందరికీ మెరుగైన, మరింత స్థిరమైన భవిష్యత్తును అందించేందుకు అమెజార్ ఇండియా మరియు సార్థక్ రెండూ నాలుగు నిర్దిష్ట లక్ష్యాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్‌కు సహకరిస్తున్నాయి. వాటిలో, ఆరోగ్యకరమైన జీవితాలను నిర్ధారించడం మరియు అన్ని వయసుల వారి సౌఖ్యాన్ని ఉత్తేజించడం; అందరినీ కలుపుకొని మరియు సమాణ్య నాణ్యతతో కూడిన విద్యను అందించడం; స్థిరమైన, ఇన్‌క్లూజన్ మరియు స్థిరమైన ఆర్థిక ప్రగతికి ఉత్తేజాన్ని, పూర్తి మరియు ఉత్పాదక ఉద్యోగం అలాగే ఘనతతో ఉపాధి; అవకాశాల్లో అసమానలతలను తగ్గించడం ఉన్నాయి.
దీనితో పిడబ్ల్యూడిల కౌశల్యానికి ప్రాధాన్యత ఇచ్చే దిశలో అమెజాన్ విస్తారంగా తక్కువ ప్రాతినిధ్యం కలిగిన సమూహాలకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుండగా, కేవలం పిడబ్ల్యూడీలకు మాత్రమే కాకుండా, విశ్రాంత సైనికులు మరియు ఎల్జిబిటిక్యూఐఏ+ సముదాయాల ప్రజలకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. జనవరి 2017లో ముంబయిలో కంపెనీ డెలివరీ సర్వీస్ పార్ట్నర్ కార్యక్రమం ద్వారా ‘సైలెంట్ డెలివరీ స్టేషన్’ను ప్రారంభించగా, అందులో ఈ స్టేషన్‌ను మాట మరియు వినికిడి లోపాలు ఉన్న వ్యక్తులు నిర్వహించేందుకు అవకాశాన్ని కల్పించింది. అదనంగా అమెజాన్ తాను పని చేసే చోట్ల వినికిడి లోపం ఉన్న ప్రజలకు సమాన అవకాశాలను సృష్టించేలా అనేక పనులు డిజైన్ చేసింది. ఈ ప్రయోగాత్మకమైన పథకం 2017లో కేవలం కొందరు మూగ, వినికిడి లోపం ఉన్న వారితో ప్రారంభం కాగా, వారికి అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్లలో షిప్మెంట్లలో ప్యాక్ చేయడంలో శిక్షణ పొందారు. ఈ కార్యక్రమం ఇప్పుడు దేశ వ్యాప్తంగా మేము సేవలు అందిస్తున్న చోట నెట్వర్కు విస్తరించింది. అదనంగా అమెజాన్ ఇండియా జూనియర్ మరియు మధ్యతరహా ప్రమాణంలోని మేనేజ్మెంట్ పోస్టులతో కలిపి క్రియాశీలకంగా కార్పొరేట్ పోస్టలకు పిడబ్ల్యూడీలను నియమించుకుంటోంది.