Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీస్ యూనిట్‌కు వాల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)లోని గ్లోబల్ లైట్‌హౌస్ నెట్వర్క్ (జిఎల్ఎన్) గుర్తింపు లభించినట్టు ఆ సంస్థ తెలిపింది. హైదరాబాద్‌లోని బాచుపల్లి తయారీ కేంద్రానికి ఈ గుర్తింపు దక్కిందని ఆ కంపెనీ పేర్కొంది. ఉత్పాదకత, శ్రామిక శక్తి, సరఫరా చెయిన్‌లో స్థిరత్వంలో ప్రభావం చూపడంతో పాటుగా నాల్గవ పారిశ్రామిక విప్లవం, సాంకేతికతలను వర్తింపజేయడంలో 100 మంది తయారీదారుల సంఘం జిఎల్ఎన్లో చేరినట్లయ్యిందని పేర్కొంది. 25 ఏండ్ల నాటి తమ సంస్థకు ఇదో పెద్ద మైలురాయి అని డాక్టర్ రెడ్డీస్ తయారీ విభాగం గ్లోబల్ హెడ్ సంజరు శర్మ పేర్కొన్నారు.