Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థ హయర్ తొలిసారి టచ్ ప్యానెల్‌తో సహా వాయిస్ కంట్రోల్ ఫ్రండ్ లోడ్ వాషింగ్ మెషీన్‌ను విడుదల చేసినట్లు ప్రకటించింది. హయర్ 979 సీరిస్ వాషింగ్ మెషీన్ పూర్తి అధునాతన ఫుల్లీ ఆటోమేటిక్ అని పేర్కొంది. డైరెక్ట్ మోషన్ మోటర్, అంతర్గతంగా నిర్మించిన వాయిస్ కమాండ్, సూపర్ డ్రమ్‌తో దీన్ని ఆవిష్కరించినట్లు తెలిపింది. 5 స్టార్ ఎనర్జీరేటింగ్తో పాటుగా ఇంటిలిజెంట్ ఫీచర్లు అయినటువంటి ఎఐ డైనమిక్ బ్యాలెన్స్ సిస్టమ్, యాంటీ బ్యాక్టీరియల్ టెక్నాలజీ , ప్యూరిస్టీమ్ దీని ఫీచర్లుగా ఉన్నాయని తెలిపింది. 10 కిలోల సామర్థ్యం కలిగిన దీని ధరను రూ.95,990గా నిర్ణయించింది.