Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేర్లను వెల్లడించడానికి నిరాకరించిన కెనరా బ్యాంక్
న్యూఢిల్లీ : పెద్ద పెద్ద బడాబాబులకు సంబంధించిన లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు రద్దు చేస్తున్నాయి. దేశంలో నాలుగో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ కెనరా బ్యాంక్ ఒక్కటే 11 ఏళ్లలో రూ.1.29 లక్షల కోట్లు మొండి బకాయిలు (బాడ్ లోన్లు) రద్దు చేసింది. అయితే ఎవరెవరికి ఎంత బకాయిలు రద్దు చేసిందో పేర్లను వెల్లడించడానికి మాత్రమే నిరాకరించింది. పూణేకు చెందిన ఆర్టీఐ కార్యకర్త వివేక్ వేలంకర్ బ్యాంక్ రద్దు చేసిన రుణాలు, ఎగవేతదారుల పేర్లను వెల్లడించాలని కోరగా, అందుకు ఎగవేతదారుల పేర్లను వెల్లడించడానికి కెనరా బ్యాంక్ నిరాకరించింది. అలాగే ఈ పెద్ద ఎగవేతదారుల నుండి రికవరీ చేయబడిన మొత్తం గురించి సమాచారాన్ని పంచుకోవడానికి కూడా నిరాకరించింది. రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ రుణాలు తీసుకున్న మొండి బకాయిలను మాఫీ చేసినట్లు తెలిపింది. 2011-12 నుండి 2021-22 వరకు రూ.1,29,088 కోట్లను మాఫీ చేసిందని తెలిపింది. అలాగే 2012-13 నుండి 2019-20 వరకు ఎనిమిదేండ్ల లో కెనరా బ్యాంక్ మొత్తం రూ.47,310 కోట్లను రద్దు చేసింది. అయితే డిఫాల్టర్ల నుండి కేవలం 19 శాతం (8,901 కోట్లు) మాత్రమే రికవరీ చేసింది. అలాగే రూ.1 కోటి అంతకంటే తక్కువ మొత్తం రుణాలు తీసుకున్నవారు 11 ఏళ్లలో రూ.1,30,812.01 కోట్లు బకాయిలు ఉన్నాయని పేర్కొన్న కెనరా బ్యాంక్, వారి వద్ద నుంచి ఎంత వసూలు చేశారనేది చెప్పేందుకు నిరాకరించింది.