Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: ఆవిష్కరణల ఆధారిత అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (గ్లెన్మార్క్)భారత దేశంలో మొట్టమొదటిసారిగా టైప్ 2 మధుమేహుల చికిత్స కోసం థియజోలిడిన్ లోబెగ్లిటజోన్ (లోబెగ్లిటజోన్)ను విడుదల చేసింది. లోబ్జ్ (లోబెగ్లిటజోన్)బ్రాండ్ పేరిట మార్కెట్ చేస్తున్న ఈ టాబ్లెట్ లలో లోబెగ్లిటజోన్ (0.5ఎంజీ) ఉంటుంది. డాక్టర్ సూచించిన మీదట రోజుకు ఒక్క మాత్రను పెద్దవయసు మధుమేహ రోగులు వినియోగించవచ్చు. భారతీయులు అధికంగా ఇన్సులిన్ వాడటానికి ఇష్టపడరు. అలాంటి వారు లోబ్జ్ను వాడవచ్చు. అనియంత్రిత టైప్ 2 మధుమేహ చికిత్సలో ఇన్సులిన్ తీసుకోవడానికి ఇష్టపడని రోగులకు దీనిని అందించవచ్చు.
ఈ ఆవిష్కరణ సందర్భంగా అలోక్ మాలిక్, ఈవీపీ అండ్ బిజినెస్ హెడ్– ఇండియా ఫార్ములేషన్స్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ మాట్లాడుతూ ‘‘ అంతర్జాతీయ డయాబెటీస్ ఫెడరేషన్ వెల్లడించేదాని ప్రకారం భారతదేశంలో 74 మిలియన్లమందిపై మధుమేహం ప్రభావం చూపుతుంది. వీరిలో 40% మంది ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉన్నారు. మధుమేహ చికిత్స పరంగా భారతదేశంలో అగ్రగామి సంస్ధగా మేము లోబ్జ్ విడుదల చేశాము. ఇది వినూత్నమైన, అందుబాటు ధరలోని ఔషదం. పెద్ద వయసు వ్యక్తులలో అనియంత్రిత టైప్ 2 మధుమేహం ఉన్న ఎడల సమర్థవంతంగా పనిచేస్తుంది’’అని అన్నారు.