Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్లెన్మార్క్ వెల్లడి
ముంబయి : పెద్ద వయసు వ్యక్తులలో అనియంత్రిత మధుమేహం కోసం లోబెగ్లిటజోన్ను విడుదల చేసినట్లు ప్రముఖ ఔషధ ఉత్పత్తుల కంపెనీ గ్లెన్మార్క్ వెల్లడించింది. ఇది అనియంత్రిత టైప్ 2 మధు మేహులలో గ్లైసెమిక్ స్థాయిలను మెరుగుపరచడంతో పాటుగా దేశంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ చికిత్స కోసం ఉపయోగపడనుందని పేర్కొంది. పెద్ద వయసు మధుమేహ రోగులు డాక్టర్ సూచన మేరకు 0.5ఎంజీ థియ జోలిడిన్ లోబెగ్లిటజోన్ (లోబెగ్లిటజోన్)ను వినియోగించవచ్చని పేర్కొంది. ఒక్క టాబ్లెట్ ధరను రూ.10గా నిర్ణయించింది. దేశంలో 7.4 కోట్ల మంది మధుమోహ బాధితులు ఉన్నారని అంచనా.