Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూస్ వచ్చే ఆరు నెలల్లో 2500 మంది సిబ్బందికి ఉద్వాసన పలికే కసరత్తులో ఉంది. ఆ సంస్థలో ని మొత్తం ఉద్యోగుల్లో ఇది 5 శాతం కావడం గమనార్హం. 2023 మార్చి నాటికి లాభాదాయక సంస్థగా మార్చాలని నిర్దేశించుకున్నట్లు బైజూస్ సహ వ్యవస్థాపకురాలు దివ్యా గోకూల్నాథ్ ఓ వార్త సంస్థతో తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్థలో 50వేల మంది పని చేస్తున్నారు. సంస్థ బ్రాండ్‌ను విస్తరించే ప్రణాళిలకల్లో భాగంగా విదేశాల్లో భాగస్వాములపై దృష్టి పెడుతున్నా మన్నారు. మెరిట్‌నేషన్, టుటర్విస్టా, స్కాలర్, హాష్లెర్న్ తదితర తమ సబ్సీడరీలను ఒకే వ్యాపారం కిందికి తీసుకొచ్చే యేచనలో ఉన్నామన్నారు.
ఇంటెల్ ఉద్యోగులపై కత్తి..
వాషింగ్టన్: ప్రముఖ సెమీ కండక్టర్ తయారీ సంస్థ ఇంటెల్‌లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికే పనిలో ఉందని సమాచారం. బ్లూమ్‌బర్గ్ రిపోర్టు ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా పర్సనల్ కంప్యూటర్ (పిసి) మార్కెట్ డిమాండ్ తగ్గడంతో ఈ యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీలో 1,13,700 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇందులో 20శాతం మంది ఉద్యోగుల్ని తొలగించే అవకాశం ఉంది. దీనిపై ఆ కంపెనీ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో తొలగింపుల రిపోర్టులకు మరింత బలాన్ని సమకూర్చుతుంది.