Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర హైదరాబాద్‌పై దృష్టి : క్రెడాయ్ వెల్లడి
హైదరాబాద్ : దేశంలో రియల్ ఎస్టేట్ డెవలపర్ల సమాఖ్య కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసొసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) నవంబర్ 5, 6వ తేదిల్లో ప్రాపర్టీ షోను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీన్ని కొంపల్లిలోని ఆస్పియస్ కన్వెన్షన్ సెంటర్ నిర్వహించనున్నామని క్రెడాయ్ హైదరాబాద్ నాయకత్వం ప్రకటించింది. ఉత్తర హైదరాబాద్‌లోని అవకాశాలపై ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షులు పి రామ కృష్ణారావు, జనరల్ సెక్రటరీ వి రాజశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రోపర్టీ షోలో అత్యుత్తమ ప్రాజెక్ట్‌లు ఉంటాయి. వీటిలో అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు, విల్లాలు, ప్లాట్స్, కమర్షియల ప్రాంగణాలు ఉంటాయన్నారు.. బాలానగర్, కొంపల్లి, షామీర్పేట, అల్వాల్, మేడ్చల్, పటాన్ చెరు, మొదలైన ప్రాంతాలలోని ప్రోపర్టీలు ఒకే గూటి కింద కనిపించనున్నాయన్నారు. ఇది తమ సంస్థకు 12వ ప్రాపర్టీ షో అని తెలిపారు. ఈ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్స్ జి ఆనంద్ రెడ్డి, కె రాజేశ్వర్, ఎన్ జైదీప్ రెడ్డి, బి జగన్నాథ్ రావు, ట్రెెజరర్ ఆదిత్య గౌర, జాయింట్ సెక్రటరీలు శివరాజ్ ఠాకూర్, కె రాంబాబు తదితరులు పాల్గొన్నారు.