Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది సెప్టెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ 7.4 శాతానికి ఎగిసిన నేపథ్యంలో ఆర్బీఐ మరోసారి వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని హెచ్ఎస్బీసీ అంచనా వేసింది. వచ్చే డిసెంబర్లో జరగనున్న ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రేపోరేటును మరో 50 బేసిస్ పాయింట్లు (అర శాతం) పెంచి 6.4 శాతానికి చేర్చే అవకాశం ఉందని పేర్కొంది. ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం మధ్య కట్టడి చేయాలనే ఆర్బీఐ లక్ష్యానికి కంటే వరుసగా ఏడో మాసంలోనూ అధికంగా చోటు చేసుకుంది. గత నెలలో జరిగిన ఆర్బీఐ ఎంపీసీ భేటీలో రెపోరేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 5.90 శాతానికి చేర్చిన విషయం తెలిసిందే.