Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : ప్రస్తుత హైబ్రిడ్ పని విధానాన్ని మరికొంత కాలం అనుసరించనున్నట్టు ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ప్రకటించింది ఇప్పటికిప్పుడు ఉద్యోగులు కార్యాలయాలకు రావడాన్ని తప్పనిసరి చేయ బోమని ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల్ పరేఖ్ తెలిపారు. కొన్ని రోజులు ఇంటి నుంచి.. మరికొన్ని రోజులు ఆఫీసు నుంచి పని చేసే హైబ్రిడ్ విధానాన్ని కొనసాగిస్తామని తెలిపారు. సిబ్బంది కచ్చితం గా ఇన్ని రోజులు ఆఫీసుకు రావాలని కూడా నియమం పెట్టబోమన్నా రు. అయితే ఎక్కువ మంది ఆఫీసుకు రావడాన్ని ప్రోత్సహిస్తామన్నారు.