Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బహుళ ప్రయో జనాల డీసీబీ సురక్ష ఎఫ్డీ ప్లాన్ను మళ్లీ తిరిగి ప్రవేశపెట్టినట్లు డీసీబీ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై అందిస్తున్న అధిక వడ్డీ రేటు వినియోగదారులకు మరింత ఆదా, లాభాన్ని అందిస్తాయని పేర్కొంది. ఎఫ్డీకి సమానంగా రూ.10 లక్షల వరకు జీవిత బీమా ప్లాన్ ఉచితంగా లభిస్తుందని పేర్కొంది. సాటిలేని ప్రయోజనాలను వినియోగదారులకు ఇది అందిస్తుందని తెలిపింది. 700 రోజులు లేదా మూడేండ్ల ఈ ప్లాన్లో 7.10 శాతం ఆకర్షణీయ వడ్డీ రేటును అందిస్తున్నట్లు పేర్కొం ది. సీనియర్ సిటిజన్లు ఇదే కాలానికి 7.60 శాతం వడ్డీ అందుకోవచ్చని తెలిపింది. వీటితో పాటుగా ఐదు సంవత్సరాలు, 10 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్లు కూడా లభ్యమవుతాయని పేర్కొంది.