Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఫేస్బుక్ మాతృసంస్థ మెటా శనివారం హైదరా బాద్‌తో పాటుగా దేశవ్యాప్తంగా 'క్రియేటర్ డే'ను నిర్వహించింది. నగరంలో తొలి సారి నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్రియేటర్లు మెటాతో కలిసి పనిచేయడంతో పాటుగా తమ సొంత అగుమెంటెడ్ రియాల్టీ (ఎఆర్) ఎఫెక్ట్స్‌ను ప్రదర్శించడానికి వీలు కల్పించింది. దీనికి తెలుగు రాష్ట్రాల నుంచి 300 మంది క్రియేటర్లు హాజరైనట్లు మెటా తెలిపింది. క్రియేటర్లను వేడుక చేయడంతో పాటుగా ఒకరి నుంచి మరొకరు నేర్చుకునేందుకు, సహకరించుకునేందుకు, సష్టించేందుకు తగిన అవకాశాలను సైతం అందిస్తున్నట్లు ఫేస్బుక్ ఇండియా పార్టనర్షిప్స్ డైరెక్టర్ మనీష్ చోప్రా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నటీ రష్మిక మందన్న పాల్గొని సందడి చేశారు.