Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లీటర్‌పై మరో రూ.2 పెంపు
- ఏడాదిలో మూడు సార్లు వాయింపు
హైదరాబాద్ : గుజరాత్ కేంద్రంగా పని చేస్తున్న ప్రముఖ పాల ఉత్పత్తి కంపెనీ అమూల్ పాల ధరలను మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లీటర్ పాలపై రూ.2 పెంచినట్లు అమూల్ బ్రాండ్ మాతృసంస్థ గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జిసిఎంఎంఎఫ్) శనివారం తెలిపింది. దీంతో ఇప్పటి వరకు లీటర్ అమూల్ ఫుల్ క్రీమ్ పాలు (అమూల్ గోల్డ్) ధర రూ.61గా ఉండగా.. తాజాగా ఇది రూ.63కు చేరింది. అర్థ లీటర్ పాల ధర రూ.30 నుంచి రూ.31కి పెరిగింది. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మూడు సార్లు పాల ధరలు పెంచినట్లయ్యింది. గుజరాత్ మినహా దేశంలోని ఇతర అన్ని ప్రాంతాలకు పెంచిన ధరలు వర్తిస్తాయని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోథి తెలిపారు. కాగా.. గుజరాత్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనున్న నేపథ్యంలో అక్కడ పెంపును చేపట్టడం లేదని స్పష్టమవుతోంది. ఇంతక్రితం ఆగస్టులో పాల ధరలను పెంచినప్పుడు పలు కారణాలు చూపగా.. ఈ దఫా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ దఫా ఎలాంటి వివరణ, కారణం చెప్పకుండానే పండగ వేళ కుటుంబాలపై భారం మోపింది.