Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్బిఐ కార్డ్ వెల్లడి
న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డుతో జరిపే లావాదేవీలను ఇఎంఐ (వాయిదా) లుగా మార్చుకునే క్రమంలో వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజును పెంచుతున్నట్లు ఎస్బిఐ కార్డ్ వెల్లడించింది. అదే విధంగా కొత్తగా అద్దె చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇఎంఐ లావాదేవీలపై ప్రస్తుతం ఉన్న ప్రాసెసింగ్ ఫీజును రూ.100 మేర పెంచి రూ.199కు చేర్చింది. అదే విధంగా పెంచిన రుసుములు నవంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. అద్దె చెల్లింపులపై కూడా రూ.99 ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది.