Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక మంత్రి సీతారామన్
వాషింగ్టన్ : అంతర్జాతీయంగా పలు సవాళ్లు, ఎదురుగాలులు ఉన్నప్పటికీ భారత్ పురోగమిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. శుక్రవారం వాషింగ్టన్లో జరిగిన అంతర్జాతీయ మాని టరీ ఫైనాన్స్ కమిటీ (ఐఎంఎఫ్సి)లో మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో 7 శాతం వృద్థిని సాధించనున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాత్మక సంస్కరణతో ముం దుకు సాగుతున్నామన్నారు. ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తదితర ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నారు. ద్రవ్యోల్బణం కట్టడి చేస్తూనే వద్ధిని కాపాడేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ పడిపోవడానికి డాలర్ విలువ పెరుగుదలే కారణమన్నారు.