Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగారం శుద్ధి, నగల తయారీ యూనిట్ ఏర్పాటు
- శంకుస్థాపన చేసిన మంత్రి కెటిఆర్
నవతెలంగాణ - బిజినెస్ బ్యూరో
రాష్ట్రంలో రూ.750 కోట్ల పెట్టుబడులతో మలబార్ గ్రూపు తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది. హైదరాబాద్ సమీపంలోని మహేశ్వరంలో 3.7 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్ కు సంబంధించి శనివారం పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు శంకు స్థాపన చేశారు. అదే విధంగా ప్లాంట్ నమూనాను ఆవిష్క రించారు. ఈ సందర్బంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. ఇక్కడ మలబార్ గ్రూపు బంగారం నగల తయారీ, పసిడి శుద్ధి, వజ్రా భరణాల తయారీని చేపట్టనుందన్నారు. ఈ యూనిట్ ద్వారా 2,750 మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. వచ్చే ఏడాది, ఏడాదిన్నరలో అందుబాటులోకి రానున్న ఈ ప్లాంట్‌ను సిఎం ప్రారంభించనున్నారన్నా రు. మలబార్ గ్రూపు పరిశ్రమ స్థాపనలో మంచి నిర్ణయం తీసుకుంద న్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనేక రంగాల వ్యాపారవేత్తలు ఆసక్తి చూపుతున్నారన్నారు. టెక్నలాజీ, ఫార్మా, లాజిస్టిక్స్, అహార ప్రాసెసింగ్ తదితర రంగాల్లో విరివిగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. భవిష్యత్తు లో మరిన్ని అభరణాల తయారీ కంపెనీలు రాష్ట్రానికి రావొచ్చని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మలబార్ గ్రూపు ఛైర్మన్ అహమ్మద్ ఎంపి మాట్లాడుతూ ఈ ప్లాంట్ 10 టన్నుల బంగారు అభరణాలు, 1.5 లక్షల క్యారెట్ల వజ్రాభరణాల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందన్నారు. అత్యాధునిక టెక్నలాజీతో తయారీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఇది దేశంలోనే తమ అదిపెద్ద తయారీ యూనిట్‌గా నిలువనుందన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తమకు 17 రిటైల్ స్టోర్లు ఉన్నాయన్నా రు. వీటిలో వెయ్యి మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారన్నారు. ప్రస్తుతం తమకు పది దేశాల్లో 280 పైగా అవుట్లెట్లు ఉన్నాయన్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి మరో 97 షోరూంలను అందు బాటులోకి తేనున్నా మని.. ఇందులో విదే శాల్లో 37 స్టోర్లను తెరువనున్నామన్నా రు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రిన్సి పల్ సెక్రటరీ జయేష్ రంజన్, పరిశ్రమల డైరెక్టర్ డి కృష్ణ భాస్క ర్, మలబార్ గ్రూపు డైరెక్టర్లు పాల్గొన్నారు.