Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అనేకమైన గుడ్ మార్నింగ్ సందేశాలు, మీరు పరిశీలించకుండానే సహాయకారిగా భావించే సమాచారమును ఫార్వార్డ్ చేయడం, లేదా వాట్సాప్ యొక్క ప్రసార జాబితాలను అతిగా ఉపయోగించడం వల్ల మీకు తెలియకుండానే మీరు మీ పరిచయస్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారా? సదుద్దేశముతో అయినప్పటికీ, కంపెనీ యొక్క సేవా షరతులను అతిక్రమించే చర్యలో, ఉదాహరణకు, అది స్పామ్ కలిగి ఉంటే, వాట్సాప్ వాడుకదారుల భద్రతను ప్రమాదములో పడవేసే లేదా ఉంచే చర్యలో నిమగ్నమైనట్లయితే మీరు మీ ఖాతాను ప్రమాదములో పడవేసుకోవచ్చు. వాట్సాప్ యొక్క నెలవారీ వాడుకదారు భద్రతా నివేదిక ప్రకారము, కేవలం ఒక్క ఆగస్టు నెలలోనే 2.3 మిలియన్ భారతీయుల ఖాతాలు నిషేధించబడ్డాయి.
వేదికపై వాడుకదారులను క్షేమంగా ఉంచడానికి సహాయపడేందుకు వాట్సాప్, భద్రతా చర్యలు మరియు ప్రక్రియల సమ్మిళితాన్ని నియోగిస్తుంది మరియు స్పామ్ నివారించడానికి గాను, అసాధారణ ప్రవర్తనలో నిమగ్నం అవుతున్న ఖాతాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవడానికి స్పామ్ డిటెక్షన్ టెక్నాలజీని వాడుతుంది.
మీ ఖాతా నిషేధించబడకుండా నివారించడానికి ఇదిగో ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి
మేసెజ్ లను ఫార్వార్డ్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి: మెసేజ్ పంపించే ముందు మరొకసారి పరిగణనలోనికి తీసుకొమ్మని వాడుకదారులను ప్రోత్సహించడానికి ఒక మార్గముగా ఫార్వార్డ్ చేయబడిన మెసేజ్లు అన్నింటికీ వాట్సాప్ ఒక లేబుల్ ఏర్పరచింది మరియు మీరు ఫార్వార్డ్ చేయదగిన సంఖ్యను పరిమితి చేసింది. ఏదైనా కొంత నిజం కాకపోవచ్చునని అనుమానంగా ఉంటే, లేదా మెసేజ్ యొక్క మూలం తెలియకుంటే, దాన్ని ఫార్వార్డ్ చేయవద్దు.
ఆటోమేటెడ్ లేదా బల్క్ మెసేజ్ లను నివారించండి: వాట్సాప్ ఉపయోగించి బల్క్ మెసేజ్ చేయవద్దు, ఆటో-మెసేజ్ చేయవద్దు, లేదా ఆటో-డయల్ చేయవద్దు. అవాంఛితమైన ఆటోమేటెడ్ సందేశాలను పంపించే ఖాతాలను కనిపెట్టి మరియు నిషేధించడానికి వాట్సాప్, మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీ మరియు వాడుకదారుల నుండి రిపోర్టులు రెండింటినీ ఉపయోగించుకుంటుంది.
ప్రసార జాబితాలను అతిగా-ఉపయోగించడం నివారించండి: వాడుకదారులు మీ ఫోన్ నంబరును తమ కాంటాక్ట్ జాబితాకు చేర్చుకున్నప్పుడు మాత్రమే ఒక ప్రసార జాబితాను ఉపయోగించి పంపించబడిన సందేశాలు అందుకోబడతాయి. ప్రసార సందేశాలను తరచుగా ఉపయోగించడం వల్ల ప్రజలు మీ సందేశాలను రిపోర్టు చేయడానికి దారితీయవచ్చు, మరియు అనేకమార్లు రిపోర్టు చేయబడిన ఖాతాలను వాట్సాప్ నిషేధిస్తుంది.
అనుమతిని అడగండి మరియు హద్దులను గౌరవించండి: మీరు పరిచయస్థులను ఒక గ్రూపులోనికి చేర్చే ముందుగా, వారి అనుమతిని పొందాలి. ఒకవేళ మీరు ఎవరినైనా ఒక గ్రూపు లోనికి చేరిస్తే, మరియు వారు తమకు తాముగా తొలగించుకుంటే, వారి నిర్ణయాన్ని గౌరవించండి. ఒకవేళ ఎవరైనా పరిచయస్థులు గనక వారికి మెసేజ్ ఇవ్వడం ఆపివేయాలని అడిగితే, మీరు మీ అడ్రస్ బుక్ నుండి ఆ కాంటాక్టును తొలగించాలి వారిని మళ్ళీ కాంటాక్ట్ చేయడం విరమించుకోవాలి.
తెలిసిన పరిచయస్థులతోనే సమాచార వినిమయం చేసుకోండి: మొదటగా మిమ్మల్ని సంప్రదించిన వారికి లేదా వాట్సాప్ పైన సంప్రదించమని మిమ్మల్ని కోరిన వారికి మాత్రమే సందేశాలు పంపించండి.
వాట్సాప్ యొక్క సేవల షరతులను అతిక్రమించవద్దు: ఒక ఖాతా నిషేధానికి కారణం, వాట్సాప్ యొక్క సేవల షరతుల అతిక్రమణ అయి ఉండవచ్చునని మనసులో ఉంచుకోండి, అందులో ఇతర విషయాలతో పాటుగా తప్పుడు సమాచారాలను ప్రచురించడం, మరియు చట్టవ్యతిరేకమైన, పరువుకు భంగం కలిగించే, అవమానించే, వేధించే ప్రవర్తనలో నిమగ్నం కావడం చేరి ఉంటుంది. మరింత సమాచారం కోసం లేదా వాట్సాప్ యొక్క సేవల షరతులను అతిక్రమించే కార్యకలాపాల ఉదాహరణల కోసం, మీరు “సేవల యొక్క షరతులు” విభాగము యొక్క మా సేవల యొక్క అంగీకారయోగ్యమైన వాడకము ను సమీక్షించవచ్చు.
పొరపాటుగా మీ ఖాతా నిషేధించబడిందని గనక మీరు భావిస్తే, మీరు ఈ క్రింది దశలను పాటించవచ్చు:
వాట్సాప్ కు ఇమెయిల్ చేయండి లేదా యాప్ లో ఒక సమీక్షను కోరండి పై ట్యాప్ చేయండి, వాట్సాప్ వారు మీ ఉదంతాన్ని పరిశీలిస్తారు మరియు వారు సమీక్షను పూర్తి చేసిన వెంటనే మిమ్మల్ని సంప్రదిస్తారు.
మీరు యాప్ లో ఒక సమీక్షను కోరినప్పుడు, మీకు SMS ద్వారా పంపించబడిన 6-అంకెల రిజిస్ట్రేషన్ కోడ్ ని ఎంటర్ చేయవలసిందిగా మీకు చెబుతారు.