Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : PhonePe గోల్డన్ డేస్ వేడుకల్లో భాగంగా దంతేరస్ 2022కోసం బంగారం, వెండిపై ఉత్సాహపూరితమైన ఆఫర్లను అందిస్తున్నామని భారతదేశపు అగ్రగామి ఫిన్ టెక్ సంస్థ PhonePe ప్రకటించింది. PhonePe వినియోగదారులు ఈ దంతేరస్ ఆఫర్ల నుండి ప్రయోజనం అందుకోవచ్చు. బంగారంపై ₹.2500 వరకు, వెండిపై ₹.500 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
బంగారం, వెండి కొనేందుకు పవిత్రమైన దినంగా భావించే ధన త్రయోదశినే దంతేరస్ అని కూడా అంటారు. బంగారం మరియు వెండి కొనుగోళ్లకు పవిత్రమైనదిగా భావించే ఈ పండుగను పురస్కరించుకుని, తన యాప్‌లో ₹.1000 లేదా అంతకుపైగా విలువ చేసే బంగారం మరియు వెండి కొనుగోళ్ల కోసం తన వినియోగదారులకు ఉత్సాహపూరితమైన డిస్కౌంట్లను PhonePe అందిస్తోంది. సెప్టెంబర్ 26, 2022 నుండి అక్టోబర్ 26, 2022 మధ్య డిజిటల్, కాయిన్లు లేదా బార్ల రూపంలో తమ బంగారం లేదా వెండి కొనుగోళ్లు కోసం పే చేసే కస్టమర్లు ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్*కు అర్హత కలిగి ఉంటారు.
PhonePe యాప్ లో బంగారం & వెండి కొనడం వల్ల కలిగే ప్రయోజనాలు:
స్వచ్ఛతకు అత్యంత భరోసా: కస్టమర్లు 24K బంగారం & వెండిని అత్యంతమైన 99.99% స్వచ్ఛత^తో PhonePeలో కొనవచ్చు. ప్రతి బంగారు నాణేల కొనుగోలుపై ఒక స్వచ్ఛత ధృవపత్రం అందించబడుతుంది.
సౌలభ్యం మరియు యాక్సెస్ చేసుకోవడం: అత్యంత నాణ్యమైన బంగారం & వెండి నాణేలు మరియు బార్ల కోసం ఇన్సూర్ చేసిన డోర్ స్టెప్ డెలివరీని కూడా కస్టమర్లు ఎంచుకోవచ్చు.
ఇన్సూర్ చేసిన బ్యాంక్ గ్రేడ్ లాకర్లలో స్టోరేజ్: కూడబెట్టడం కోసం డిజిటల్ మార్గంలో కొనుగోలు చేసిన 24Kగా ధృవీకరించిన బంగారానికి తయారీ ఖర్చులు ఉండవు. అలాగే ఉచిత* & ఇన్సూర్ చేసిన బ్యాంక్ గ్రేడ్ లాకర్లలో నిల్వ చేయబడుతుంది.
PhonePeలో బంగారం కొనుగోలు ప్రక్రియ దశల వారీగా కింద ఇవ్వబడింది:
1వ దశ: PhonePe యాప్ హోమ్ పేజీలో, కింది భాగాన ఉన్న Wealth/సంపదపై క్లిక్ చేయండి.
2వ దశ: తర్వాత, మీ కొనుగోలు ప్రాధాన్యత ఆధారంగా బంగారం/వెండిపై క్లిక్ చేయండి.
3వ దశ: ‘Start Accumulating/కూడబెట్టడం ప్రారంభించు’ లేదా ‘Buy More Gold/మరింత బంగారం కొను’పై క్లిక్ చేయండి.
దీనికి బదులు, మీరు బంగారం కొని, దానిని మీ ఇంటివద్దకే డెలివరీ చేయాలని మీరు కోరుకుంటే, మీరు కింది బంగారం/వెండి కాయిన్లలో దేనినైనా ఎంచుకోవచ్చు.
4వ దశ: మొత్తాన్ని ప్రవేశపెట్టి, ‘Proceed/ముందుకెళ్లు’పై క్లిక్ చేయండి.
5వ దశ: చివరగా, కొనుగోలును పూర్తి చేసేందుకు ‘Proceed to Pay/పే చేసేందుకు ముందుకెళ్లండి’పై క్లిక్ చేయండి.
PhonePe పరిచయం:
PhonePe 2015 డిసెంబరులో స్థాపించబడి, భారతదేశపు అతి పెద్ద పేమెంట్స్ యాప్‌గా అభివృద్ధి చెంది, వినియోగదారులను, వ్యాపారులను డిజిటల్ ప్రపంచంలోకి తీసుకువచ్చింది. PhonePeలో 40 కోట్ల వినియోగదారులు రిజిస్టర్ చేసుకున్నారు. అంటే ప్రతి నలుగురు భారతీయులలో ఒకరు PhonePe వినియోగదారుగా ఉన్నారు. 2,3,4 శ్రేణి నగరాలు మరియు వాటికన్నా తక్కువ స్థాయిలకు చెందిన 3.2 కోట్లకు పైగా ఆఫ్‌లైన్ వ్యాపారులను ఈ సంస్థ విజయవంతంగా డిజిటలీకరణ చేసి భారతదేశంలోని 99% పిన్ కోడ్ల వరకు విస్తరించింది. 2017లో బంగారం కొనుగోలు ఆవిష్కరించడం ద్వారా PhonePe ఆర్థిక సేవల రంగంలోకి అడుగుపెట్టి, యూజర్లకు సురక్షితమైన, అనుకూలమైన విధానాలతో 24-క్యారెట్ల బంగారం కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. అలాగే ఇటీవల వెండి కొనుగోళ్లను కూడా తమ ప్లాట్ఫామ్లో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ట్యాక్స్-సేవింగ్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, కొవిడ్-19 పాండమిక్ ఇన్సూరెన్స్ లాంటి వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్లను PhonePe పరిచయం చేసింది. PhonePe ఉపయోగించి, యూజర్లు డబ్బు పంపించవచ్చు, అందుకోవచ్చు, మొబైల్, డీటీహెచ్ రీఛార్జ్, స్టోర్లలో పేమెంట్లతో పాటు, యుటిలిటీ పేమెంట్లను కూడా చేయవచ్చు. ట్రస్ట్ రీసెర్చ్ అడ్వయిజరీ (టీఆర్ఏ) ఇటీవల ప్రచురించిన బ్రాండ్ విశ్వసనీయత రిపోర్ట్ 2022 ప్రకారం డిజిటల్ పేమెంట్స్ విషయంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా PhonePe గుర్తింపు పొందింది.
స్వచ్ఛత అనేది పూర్తిగా బంగారం భాగస్వామ్య సంస్థల హామీకి సంబంధించినది.
PhonePe's పాత్ర అనేది పేమెంట్ సౌలభ్యం/ప్రాసెసింగ్ వరకే పరిమితం చేయబడింది. ఆర్డర్ నిర్వహణ/నెరవేర్చడం అనే కార్యాలను PhonePe భాగస్వాములు నిర్వహిస్తారు. దయచేసి కొనుగోలు చేసే ముందు ఆఫర్ నియమ, నిబంధనలు చదవండి, నియమ, నిబంధనలు వర్తిస్తాయి.